Akshay Kumar Sky Force | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం స్కై ఫోర్స్’(Sky Force). ఈ సినిమాతో వీర్ పహరియా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండగా.. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా.. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్లపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే బంపరాఫర్ ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు బుక్ మై షోలో రూ.250 విలువైన కూపన్ కోడ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. SkyForce250 అనే కూపన్ కోడ్‌ని ఎంటర్ చేస్తే ఫ్రీగా సినిమా చూడవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ విడుదల రోజైన 24 నుంచి రిపబ్లిక్ డే వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ ఆఫర్‌ను పోందడానికి యూజర్లు మొబైల్ నెంబర్‌తో లేదా ఈమెయిల్‌తో లాగిన్ అవ్వవలసి ఉంటుందని ప్రకటించింది.
The skies hold their story, and patriotism lights the way ✈️🔥
Join Sky Force this Republic Day weekend. Book your tickets now! 🙌https://t.co/vlFEZ4RULE
Use code SKYFORCE250 and get flat ₹250 off on tickets. T&Cs apply 🎟️ pic.twitter.com/62iiniUUTu
— BookMyShow (@bookmyshow) January 22, 2025