విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో విక్రమ్ (Vikram) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీ రోల్లో నటించబోతున్నాడన్న వార్త అటు బీటౌన్‌లో, ఇటు సౌత్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం బిగ్ బీ విక్రమ్ సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశంలో కనిపిస్తాడట. కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. విక్రమ్ 2022 జూన్ 13 తెలుగు, తమిళంతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతుంది.
కమల్‌హాసన్ నటిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శాన్వీశ్రీవాత్సవ, అలనాటి అందాల తార మహేశ్వరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.