Balakrishna-Anil Ravipudi Movie | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అనిల్ ఈ చిత్రాన్నిఅవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు ఇటీవలే తెలిపాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలోని ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హాను సంప్రదిస్తున్నట్లు టాక్. అనీల్ రావిపూడి త్వరలోనే సోనాక్షీకి కథ వినిపించనున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో బాలయ్య 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో నటించనున్నాడు. పెళ్లిసందడి ఫేం శ్రీలీలా బాలయ్య కూతురులా నటించింది. ఈ సినిమా మొత్తం ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో సాగుతుందని అనీల్ ఇదివరకే తెలిపాడు. బాలకృష్ణకు జోడీగా అంజలి నటించనుందని టాక్.