Bollywood | మళ్లీ పబ్లిసిటీనా…బాలీవుడ్ హీరో అసహనం..?
బాలీవుడ్ (Bollywood) చిత్రాల లిస్టు మొత్తం తారుమారైంది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఇక మన సినిమాలు విడుదల చేసుకోవచ్చు అనుకున్న దర్శకనిర్మాతలు, హీరోలకు థర్డ్ వేవ్ వచ్చి పడి మళ్లీ వాయిదాల పర్వం అలవాటు చేసింది.
మూడు వేవ్ ల కరోనా వల్ల దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. ఏడాది ముందే షెడ్యూల్ చేసుకునే బాలీవుడ్ (Bollywood) చిత్రాల లిస్టు మొత్తం తారుమారైంది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఇక మన సినిమాలు విడుదల చేసుకోవచ్చు అనుకున్న దర్శకనిర్మాతలు, హీరోలకు థర్డ్ వేవ్ వచ్చి పడి మళ్లీ వాయిదాల పర్వం అలవాటు చేసింది. ఈ మధ్యలో సినిమాలు విడుదలవుతాయని భారీగా పబ్లిసిటీ కూడా చేసుకున్నారు. చేసిన ఈవెంట్ల ఖర్చు, ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలు, టీవీ స్టూడియోలకు తిరిగిన శ్రమ అంతా వృథానే అయ్యింది.
ఏమైనా సినిమాలు రిలీజ్ చేసుకోక తప్పదు. అందుకే కోవిడ్ సద్దుమణిగిన తాజా పరిస్థితుల్లో బాలీవుడ్ లో మళ్లీ సినిమా రిలీజ్‌ల హడావుడి పెరిగింది. ఈ లిస్టులో ఉంది షాహిద్ కపూర్ (Shahidkapoor) జెర్సీ (Jersey) సినిమా. వచ్చే నెల 14న విడుదల కాబోతున్నది. ఈ తేదీన కేజీఎఫ్ 2తో పోటీ పడి జెర్సీ ప్రేక్షకుల ముందుకొస్తున్నది. కాంపిటేషన్ ఉన్నప్పుడు ప్రచారం చేసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు ఒకసారి విస్తృతంగా ప్రచారం చేశారు. సినిమా వాయిదా పడింది.
Read Also : Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ దగ్గరకొస్తోంది. దీంతో హీరో షాహిద్ కపూర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమాకు రెండు సార్లు ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో చెబుతారా అంటూ ప్రేక్షకులనే సూచనలు అడుగుతున్నారు. తెలుగు సినిమా జెర్సీని అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) రూపొందించగా..దిల్ రాజు నిర్మించారు.
నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రతిభ గల క్రికెటర్ ఫెయిల్యూర్ కథను ఉద్వేగపూరితంగా చూపించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల మెప్పుతో పాటు జాతీయ పురస్కారం దక్కింది. బాలీవుడ్ జెర్సీపై ఉత్తరాది ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also : Godfather Sets | గాడ్ ఫాదర్ షూటింగ్ మూడ్‌లో సల్మాన్ ఖాన్..వీడియో
Read Also : R glimpse Video | స్టార్ హీరోతో వర్మ కొత్త సినిమా..గ్లింప్స్ వీడియో అదిరింది
Read Also : RRR Celebrities | ఆర్ఆర్ఆర్ ఓ మాస్టర్ పీస్…సినీ ప్రముఖుల ప్రశంసలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

