బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ షోను వివాదాలకు చిరునామాగా చెబుతారు. ముఖ్యంగా ఆహ్వానిత తారల నుంచి వారి వ్యక్తిగత, శృంగార జీవితానికి సంబంధించిన విషయాల్ని రాబట్టడంపైనే కరణ్‌జోహార్ ఎక్కువగా దృష్టిపెడతారనే విమర్శ ఉంది.
తాజాగా ఈ కార్యక్రమంపై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది అగ్ర కథానాయిక తాప్సీ. కరణ్‌జోహార్‌ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం తాప్సీ తన తాజా చిత్రం ‘దొబారా’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ విలేకరి ఆమెను ‘మీకు కరణ్‌జోహార్ షో నుంచి ఎందుకు ఆహ్వానం అందడం లేదు’ అని ప్రశ్నించారు.
దీనిపై తాప్సీ తనదైలి శైలి వ్యంగ్యంతో సమాధానమిచ్చింది. తన శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదని, ఆ కారణంగానే ‘కాఫీ విత్ కరణ్’ షో నుంచి ఆహ్వానం అందడం లేదని సెటైర్ విసిరింది. ఆమె సమాధానంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. కరణ్‌జోహార్ వ్యవహార శైలిపై తాప్సీ గట్టి కౌంటర్ ఇచ్చిందని అందరూ మట్లాడుకున్నారు.