Bollywood | సారా అర్జున్ – ఇషాన్ ఖట్టర్ కెమిస్ట్రీకి నెటిజన్లు ఫిదా.. ‘ఏ పర్ఫెక్ట్ మ్యాచ్’తో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా హాట్ జోడీ!
Bollywood | ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఒకే జంట గురించి చర్చించుకుంటోంది. అదే సారా అర్జున్ – ఇషాన్ ఖట్టర్. వీరిద్దరూ కలిసి నటించిన మైక్రో సిరీస్ ‘ఏ పర్ఫెక్ట్ మ్యాచ్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కేవలం కొన్ని ఎపిసోడ్లతోనే ఈ జంట ఇంటర్నెట్లో మోస్ట్ ఫేవరెట్ జోడీగా మారిపోవడం విశేషం.
Bollywood | ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఒకే జంట గురించి చర్చించుకుంటోంది. అదే సారా అర్జున్ – ఇషాన్ ఖట్టర్. వీరిద్దరూ కలిసి నటించిన మైక్రో సిరీస్ ‘ఏ పర్ఫెక్ట్ మ్యాచ్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కేవలం కొన్ని ఎపిసోడ్లతోనే ఈ జంట ఇంటర్నెట్లో మోస్ట్ ఫేవరెట్ జోడీగా మారిపోవడం విశేషం. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ సహకారంతో రూపొందిన ఈ సిరీస్‌లో ప్రేమకథను ఒక కొత్త కోణంలో చూపించారు. నిత్యజీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలను సెర్చ్ ఇంజిన్ కాన్సెప్ట్‌తో మేళవిస్తూ కథను నడిపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఇప్పటివరకు విడుదలైన ఎపిసోడ్లు మంచి స్పందనను రాబట్టగా… ప్రతి ఎపిసోడ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
ముఖ్యంగా సారా – ఇషాన్ మధ్య ఉన్న నేచురల్ కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు ప్రధాన బలం. సాధారణంగా కనిపించే మాస్ లేదా క్లిష్టమైన పాత్రల కంటే వీరి మధ్య ఉన్న ఫ్రెష్ వైబ్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది. వారి సంభాషణలు, భావోద్వేగాలు చాలా సహజంగా ఉండటంతో యూత్‌లో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక నెటిజన్లు అయితే ఈ జంటను పెద్ద తెరపై కూడా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. రొటీన్ జంటలతో పోలిస్తే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కొత్త తరహాలో ఉండటం కూడా ఈ క్రేజ్‌కు కారణంగా మారింది.
ఇటీవల సారా అర్జున్ నటించిన ‘ధురంధర్’, ఇషాన్ ఖట్టర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమాలు కూడా మంచి ప్రశంసలు అందుకోవడంతో ఈ ఇద్దరూ నవతరం నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్‌లో కనిపించడం సినీ ప్రియులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ‘ఏ పర్ఫెక్ట్ మ్యాచ్’ ద్వారానే అలరిస్తున్న ఈ జంటను త్వరలోనే ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌లో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మైక్రో సిరీస్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే… భవిష్యత్తులో ఈ జంటతో పెద్ద ప్రాజెక్ట్ రావడం ఖాయం అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

