తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని బాలీవుడ్ బ్యూటీ.. శ్రద్ధా కపూర్. బీటౌన్‌లో
విలక్షణ ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకున్న శక్తి కపూర్ కుమార్తెగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సాహో’లో ప్రభాస్ సరసన మెరిసింది. అయితే, ప్రస్తుతం ఈ అమ్మడు.. స్క్రీన్‌ప్లే రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నదంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట.. అడపాదడపా కెమెరా కళ్లకు చిక్కుతూ ఆ వాదనలకు మరింత బలాన్ని ఇస్తున్నది. అంబానీల ఇంట పెళ్లి వేడుక మొదలుకొని.. సన్నిహితుల వివాహ సంబురాల్లోనూ ఈ జంట అనేకసార్లు దర్శనమిచ్చింది. సినిమా ఈవెంట్లలోనూ రాహుల్ మోడీతో కనిపించింది.
దాంతో.. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని బీటౌన్‌లో తరచుగా టాక్ వినిపిస్తూనే ఉన్నది. తాజాగా, శ్రద్ధా కపూర్ – రాహుల్ మోడీ కలిసి ఉన్న ఓ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది. ఈ చిన్న వీడియో క్లిప్‌లో రాహుల్‌ను గట్టిగా హత్తుకుని, వీడ్కోలు చెబుతున్నది శ్రద్ధా కపూర్. అయితే, ఈ వీడియోను చూసినవాళ్లంతా.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనీ అంటున్నారు.
వైరల్ అవుతున్న సదరు వీడియో కింద పెళ్లి గురించే కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఇక శ్రద్ధా కపూర్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది వచ్చిన ‘స్త్రీ2’తో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో శ్రద్ధా ఒక్కసారిగా టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ‘స్త్రీ3’తోపాటు హృతిక్ రోషన్‌తో క్రిష్ 4, రణ్‌బీర్ కపూర్‌తో ధూమ్ 4 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నది.