Akhanda | మాకు మాత్రం అఖండ చూడాలని ఉండదా.. ఎందుకీ వివక్ష ?

Akhanda in Hindi | బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు ఉన్న క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు పెరిగింది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లాయి. కొన్ని సినిమాలు డబ్ చేసి విడుదల చేస్తే.. మరికొన్ని రీమేక్ అయ్యాయి. వాటికి బాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకు తాజాగా విడుదలైన పుష్ప సినిమానే నిదర్శనం. ఈ సినిమాకు తెలుగులో కంటే కూడా హిందీలోనే ఎక్కువ లాభాలు వచ్చాయి. దీన్ని బట్టే మన తెలుగు సినిమాలపై బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత పిచ్చి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా తెలుగు నుంచి చాలా సినిమాలు హిందీలోకి వెళ్తున్న ఈ టైంలో.. బాలయ్య అఖండ సినిమా మాత్రం కేవలం తెలుగులోనే విడుదలైంది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాపై ఎందుకు వివక్ష? బాలయ్య బాబు అఖండ సినిమాను మేం చూడొద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈమధ్యకాలంలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా అఖండ. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం బాలయ్య అభిమానులకే కాదు.. తెలుగు ప్రేక్షకులు అందరికీ ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. అందుకే ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలైన 7 వారాల తర్వాత పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ పెట్టారంటే మామూలు విషయం కాదు. కానీ ఆ ఘనతను బాలయ్య అఖండ సినిమా సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అఖండ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న క్రేజ్‌ను చూసి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా ఇంత హిట్ అయితే వాళ్లకు ఏమవుతుందని అనుకుంటున్నారా.. ఈ సినిమాలో ఉన్న ఎలివేషన్స్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెలిసిందే కదా. అంత గొప్ప ఫీల్‌ను ఇప్పుడు మేమెందుకు మిస్ అవ్వాలి.. మేం ఏం పాపం చేశామని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పుష్ప సినిమాను విడుదల చేసినట్టుగానే అఖండ సినిమాను కూడా హిందీలోకి డబ్ చేయాలని అడుగుతున్నారు. డబ్బింగ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ సినిమాను హిందీలోకి రీమేక్ అయినా చేయండి ప్లీజ్ అని బతిమిలాడుతున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఒక హ్యాష్‌ట్యాగ్‌ను కూడా క్రియేట్ చేశారు. wewantakhandainhindi పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అజయ్ దేవగణ్ లేదా అక్షయ్ కుమార్ ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి హిందీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని అఖండ సినిమాను హిందీలోకి డబ్ చేస్తారా? లేదా రీమేక్ చేస్తారా? అనేది చూడాలి మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pragya Jaiswal | అఖండ బ్యూటీకి బాలీవుడ్లో బంపర్ ఆఫర్..
Akhanda Remake | అఖండ రీమేక్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్
పాన్ ఇండియన్ దండయాత్రకు సిద్ధమవుతున్న బాలకృష్ణ
Akhanda Making Video | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాలయ్య ‘అఖండ’ మేకింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

