Vidya Balan | టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి పనిచేయనున్న విషయం తెలిసిందే. ‘పూరి సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటి టబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కూడా నటించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, పూరి జగన్నాథ్ ఈ సినిమాలో విద్యా బాలన్ కోసం ఒక శక్తివంతమైన పాత్రను ప్రత్యేకంగా రూపొందించారట. ఆమె ఈ చిత్రంలో ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇదివరకే ఈ సినిమాలో ప్రముఖ నటీనటులైన రాధికా ఆప్టే, నివేత థామస్ మరియు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందనుందని తెలుస్తోంది.
ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. పూరి జగన్నాథ్ మరియు విజయ్ సేతుపతి కెరీర్లో ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలువనుంది. పూరి జగన్నాథ్ తన నట-నిర్మాత ఛార్మి కౌర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్రం గురించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రొడక్షన్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.