Urvashi Rautela | రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల బయటకు వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ ఆడిన సందర్భంగా జట్టుకు మద్దతు ఇచ్చేందుకు అరుణ్ జైట్లీ మైదానానికి పంత్ వచ్చాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ యువతి ‘థ్యాంక్ గాడ్ ఊర్వశి ఇక్కడ లేదు’ అని అంటూ ప్లకార్డును ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా కంట పడింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫొటోను షేర్ చేస్తూ ‘ఎందుకు’ అంటూ ప్రశ్నించింది.
వాస్తవానికి రిషబ్ పంత్, ఊర్వశి రౌటెలా మధ్య ఏ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని, గతంలో ఊర్వశి టీమిండియా ఆడిన పలు క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన సమయంలో ఇలాంటి వార్తలు వచ్చాయి. రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత, ఊర్వశి రౌతేలా ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రి చిత్రాన్ని పోస్ట్ చేసింది. దాంతో ఈ హాస్పిటల్లోనే రిషబ్‌ను పరామర్శించి ఉండవచ్చని ప్రచారం జరిగింది. ఊర్వశి రౌటెలా, రిషబ్ పంత్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల ద్వారా బాగా చర్చనీయాంశం అయ్యాయి.
2018లో వారు పలు ఈవెంట్లలో కలిసి కనిపించారు. తర్వాత వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే, 2019లో, రిషబ్ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ.. స్నేహితురాలు ఇషా నేగితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను వారణాసి షూటింగ్లో ఉన్నానని, అదే సమయంలో ఓ షో కోసం ఢిల్లీకి వచ్చాయని చెప్పింది. ఫుల్ డే షూటింగ్లో ఉన్నానని, ఆ తర్వాత నేను నిద్రపోతున్న సమయంలో నన్ను కలిసేందుకు మిస్టర్ ఆర్పీ వచ్చాడని, లాబీలో తన కోసం వేచి ఉన్నాడని చెప్పుకొచ్చింది.
నిద్రలేచి చూసే సరికి 16, 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని తెలిపింది. మిస్టర్ ఆర్పీ ఎవరో కాదు రిషబ్ పంత్ అంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై రిషబ్ పంత్ ఘాటుగానే స్పందించాడు. కొందరు పాపులారిటీ కోసం, వార్తల్లో నిలిచేందుకు ఎలాంటి అబద్ధాలైనా చెబుతారని మండిపడ్డాడు. కీర్తి, పేరు కోసం అబద్దాలు చెప్పడం బాధాకరమంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై సైతం ఊర్వశి మళ్లీ కౌంటర్ ఇచ్చింది. పంత్ గాయపడ్డ తర్వాత ఊర్వశి ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ హార్ట్, వైట్ డోవ్ ఎమోజి పోస్ట్ చేస్తూ అతని కోసం ప్రార్థిస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది.