Uorfi Javed | బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) గురించి పరిచయం అవసరం లేదు. విచిత్ర వేషధారణతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వైర్, కాటన్, తాడు ఇలా ఎన్నో వస్తువులను డ్రెస్‌లుగా మలిచి డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంది. ఇదిలావుంటే తాజాగా ఈ భామ సరికొత్త డ్రెస్‌తో మరోసారి మన ముందుకొచ్చింది.
దేశవ్యాప్తంగా భానుడు వీర ప్రతాపం చూపుతున్న విషయం తెలిసిందే. సమ్మర్ సందర్భంగా తాజాగా స్పెషల్ అవుట్ ఫిట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది ఉర్ఫీ. బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్‌లో ముందుకొచ్చిన ఈ భామ.. ఎదపై ఫ్యాన్స్ పెట్టుకుని వాటికీ బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చి తిప్పుతూ క్రేజీగా కనిపిస్తుంది. కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక బిగ్‌బాస్ ఓటీటీతో ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) ఫేమ్‌లోకి రాగా ఆపై ఆమె పలు టీవీ షోస్‌లో నటించింది.