Shilpa Shetty | గుర్రంపై శిల్పాశెట్టి..ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?
బాలీవుడ్ (Bollywood) నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) తన స్నేహితురాలితో కలిసి జమ్మూకశ్మీర్ లోని కత్రాకు చేరుకుంది. అక్కడి నుంచి స్నేహితురాలితో మాతా వైష్ణోదేవి ఆలయాని (Mata Vaishno Devi temple) కి బయలుదేరింది శిల్పాశెట్టి.

బాలీవుడ్ (Bollywood) నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) ముంబై ఎయిర్ పోర్టు దగ్గర కనిపించగా..అక్కడే ఉన్న కెమెరామెన్లు తమ కెమెరాల్లో బంధించారు. అయితే శిల్పాశెట్టి ఎక్కడికెళ్తుందని అంతా ఆలోచించడం మొదలుపెట్టారు. కట్ చేస్తే శిల్పాశెట్టి దైవ దర్శనం కోసం వెళ్లిందని తాజాగా నెట్టింట్లో విడుదలైన ఫొటోల ద్వారా క్లారిటీ వచ్చింది. బుధవారం శిల్పాశెట్టి తన స్నేహితురాలితో కలిసి జమ్మూకశ్మీర్ లోని కత్రాకు చేరుకుంది. అక్కడి నుంచి స్నేహితురాలితో మాతా వైష్ణోదేవి ఆలయాని (Mata Vaishno Devi temple) కి బయలుదేరింది శిల్పాశెట్టి.
ఇద్దరూ 5 వేలకుపైగా అడుగుల ఎత్తులో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి గుర్రంపై చేరుకున్నారు. వైష్ణోదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం దర్శనం కోసం వచ్చిన శిల్పాశెట్టికి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో తీసిన ఫొటోలు బయటకు రావడంతో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

పోర్న్ రాకెట్ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు జులై 19న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా చార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొన్నారు. ముంబై పోలీసులు శిల్పాశెట్టి స్టేట్ మెంట్ ను కూడా నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 1400 పేజీల చార్జ్‌షీట్ ను ఫైల్ చేశారు. రాజ్ కుంద్రా కేసుతో షాక్ లోనైన శిల్పాశెట్టి దయ చేసి తనకు ప్రైవసీ కల్పించేలా చూడాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం తన సినీ కెరీర్, ఇతర కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది శిల్పాశెట్టి. సినిమాలతోపాటు డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డ్యాన్సర్ చాప్టర్-4తో బిజీగా ఉంది శిల్పాశెట్టి.
ఇవి కూడా చదవండి..
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

