Mouni Roy | సినీ ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక విడాకుల వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయని తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకోబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం.. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఖాతాల నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి.
తాజాగా ఈ న్యూస్‌పై మౌనీ రాయ్ స్పందించింది. అన్ని మీడియా సంస్థలను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేయొద్దు.. మాకు కొంచెం స్పేస్, ప్రైవసీ ఇవ్వండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. తాజా పోస్ట్‌తో విడాకుల వార్తలు పుకార్లు మాత్రమేనని అర్థమవుతోంది. కొంతకాలం ప్రేమలో ఉన్న మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ 2022 జనవరి 27న గోవాలో జరిగిన వేడుకలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. బెంగాలీ, మలయాళ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లి అప్పట్లో చర్చకు దారితీసింది.

Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు