Saif Ali Khan | ప్రభాస్ వంటకాలకు సైఫ్ అలీఖాన్ టీం ఫిదా
టాలీవుడ్ (Tollywood) యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ప్రభాస్ ( Prabhas). తాజాగా ఇవాళ బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ ఓం రావత్ తో చేస్తున్న ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్.

టాలీవుడ్ (Tollywood) యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ప్రభాస్ ( Prabhas). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సలార్ ఇప్పటికే సెట్స్ పై ఉంది. తాజాగా ఇవాళ బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ ఓం రావత్ తో చేస్తున్న ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. ముంబైలో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరణ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం ఎయిర్ కండిషన్డ్ సెట్ లో ప్రభాస్ తోపాటు ఇతర తారాగణంపై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ప్రభాస్ సొంతం. తనకు ఎంత స్టార్ డమ్ వచ్చినా తనకిష్టమైన ఆంధ్రా వంటకాలపై మాత్రం మమకారం చూపిస్తూనే ఉంటాడు. అంతేకాదు కోస్టార్స్ కు కూడా ఆ వంటకాల రుచులను అందిస్తుంటాడు.
తాజాగా ఆదిపురుష్ సెట్స్ లో అదే పనిచేశాడు ప్రభాస్. లంఛ్ టైంలో వివిధ రకాల ఆంధ్రా వంటకాలను సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) అండ్ టీం సభ్యులకు వడ్డించాడట ప్రభాస్. ఇంత మంచి ఆహారాన్ని అందించిన ప్రభాస్ గొప్ప అతిథ్యానికి ఫిదా అయిపోయినట్టు బీటౌన్ వర్గాల టాక్. మొత్తానికి ప్రభాస్ బాలీవుడ్ స్టార్లకు తెలుగు వంటకాల ప్రాముఖ్యతను తెలియజేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి.
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

