Animal Movie | ‘యానిమల్’ (Animal) సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol). ఈ సినిమాలో అబ్రార్(Abrar) అనే మూగ విలన్‌గా నటించి బాబీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో అతడి క్యారెక్టర్ నిడివి తక్కువే అయిన తనదైన శైలిలో నటించి అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు. ఇక యానిమల్‌లో బాబీ నటనకు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ పట్ల కొన్ని ఆసక్తికర విషయాలను బాబీ తాజాగా పంచుకున్నాడు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్ ఈ సినిమాలో అతడిని ఇబ్బందిపెట్టిన విషయాలపై పెదవి విప్పాడు. యానిమల్ షూటింగ్ మొదట్లో నా పాత్ర (అబ్రార్)పై చాలా ఇబ్బందిపడ్డాను. అయితే ఎందుకిలా చేస్తున్నా అని తరువాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అనంతరం ఈ సినిమాలో కేవలం నేను ఓ విలన్ పాత్రలో మాత్రమే నటిస్తున్నాని గ్రహించాను. ఇక షూటింగ్ సమయంలో ఎవరితో కోపంగా ఉన్నానో వారితోనే షూట్ అనంతరం కలిసి డిన్నర్ చేశాను. యానిమల్‌లో నేను విలన్ అని ఎప్పుడు అనుకోలేదు. కేవలం ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమించే ఓ వ్యక్తిగానే భావించాను. తన తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే మనవడిలో పాత్రలో నటించానంటూ బాబీ చెప్పుకోచ్చారు.
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.