డ్రగ్స్ మాటే వినిపించకూడదు, మిల్లీ గ్రాము మాదకద్రవ్యం కనిపించకూడదు అనే టార్గెట్‌తో పనిచేసే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘బ్లడీ డాడీ’లో ఈ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు షాహిద్. ఫ్రెంచ్ మూవీ ‘నూట్ బ్లాంచీ’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని, అవన్నీ దాదాపుగా తానే స్వయంగా చేశానని చెబుతున్నారు షాహిద్ కపూర్. ఆయన మాట్లాడుతూ…‘ ఈ సినిమాలో డ్రగ్ మాఫియా పని పట్టే క్రమంలో ఎక్కువ పోరాటాలు తెరకెక్కించారు. నేను ఇంత యాక్షన్ సీన్స్ మరే చిత్రంలో చేయలేదు. ఇవన్నీ నేనే స్వయంగా చేయడం సంతృప్తిగా ఉంది’ అన్నారు.