ఆది సాయికుమార్ నటిస్తున్న సినిమా ‘బ్లాక్’. దర్శన బానిక్ నాయికగా నటిస్తున్నది. ఆమని, కౌశల్, పృథ్వీ, సత్యం రాజేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.బి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 28న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు జి.బి. కృష్ణ మాట్లాడుతూ..‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఆది సాయికుమార్‌కు కొత్త తరహా సినిమా అవుతుంది. ఆయన నటనతో పాటు కథా కథనం ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. మే 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, ఎడిటింగ్ : అమర్ రెడ్డి, సంగీతం : సురేష్ బొబ్బిలి.