SS Rajamouli | దిగ్గజ దర్శకుడు రాజమౌళి గ్లోబ్ ట్రాటార్ ఈవెంట్లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ రాజమౌళి వద్దకు వచ్చి హనుమంతుడిని తలచుకో అంతా సెట్ అవుతుందని చెబుతాడు. అయితే ఈ విషయంపై రాజమౌళి మాట్లాడుతూ.. నేను మాములుగా దేవుడిని నమ్మను. నాన్న గారు వచ్చి ఇందాక హనుమాన్ వెనకాల ఉంటాడు.. గుండెతట్టి నడిపిస్తాడు అని చెప్పారు.. ఇలా అయిన వెంటనే కోపం వచ్చిందండి …ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం.. ఫ్రెండ్ లాగా మాట్లాడుతది అతడితో.. మా ఆవిడా మీద కూడా కోపం వచ్చింది… ఏంటి ఇదేనా చేసేది అని చెప్పుకోచ్చాడు. అయితే రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పలు హిందు సంఘాలతో పాటు బీజేపీ నేతల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ సనతాన ధర్మ రక్షకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుంటే రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ గ్యాంబ్లింగ్, మానీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన చీకోటి ప్రవీణ్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఒక వార్నింగ్ వీడియోను వదిలాడు. రాజమౌళి.. హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుద్దో తెలుసు కదా. నువ్వు దేవుడిని నమ్మనప్పుడు నాస్తిక కుక్కలతోనే తీయాలి.. నాస్తిక కుక్కలే సినిమా చూడటానికి అనుమతి ఇవ్వాలి. దేవుడిని నమ్మకపోతే ప్రతి సినిమాకు ముందు పూజ ఎందుకు చేస్తున్నావు. బిడ్డా రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పక పోతే ద్రోహిగా మిగిలిపోతావు అంటూ చికోటి వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు.
రాజమౌళి.. హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుద్దో తెలుసు కదా
రాజమౌళి సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలి.. నాస్తిక కుక్కలే సినిమా చూడటానికి అనుమతి ఇవ్వాలి
దేవుడిని నమ్మకపోతే ప్రతి సినిమాకు ముందు పూజ ఎందుకు చేస్తున్నాడు
బిడ్డా రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు… https://t.co/rNghWH56UN pic.twitter.com/a3N2SaWB2y
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2025