Bigg Boss Telugu New Host – Vijay Devarakonda | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 8 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో 9వ సీజన్‌కి సిద్ధమవుతుంది. ఇక 9వ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే కొత్త సీజన్‌కి కొత్త హోస్ట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన 8 సీజనలలో మొదటి సీజన్‌కి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయగా ఆ తర్వాత వచ్చిన సెకండ్ సీజన్‌కి నాని వ్యాఖ్యతగా వ్యవహారించాడు. ఇక మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు సక్సెస్ఫుల్ హోస్ట్‌గా రాణిస్తున్నాడు కింగ్ నాగార్జున. అయితే తాజాగా వచ్చే కొత్త సీజన్‌కి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్‌గా చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీపికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ వార్త విన్న విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కాగా ఇందుకు సంబంధించి బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.