కంటెస్టెంట్ కాజల్‌పై బిగ్ బాస్ నిర్వాహకులు సీరియస్.. కారణం ఇదే..

RJ Kajal elimination | బిగ్ బాస్ 5 తెలుగు చివరి వారానికి ముందు.. అంటే 14వ వారం ఇంటి నుంచి ఆర్జే కాజల్ బయటకు వచ్చేసింది. అధికారికంగా ఇంకా ఎపిసోడ్ ప్రసారం కాలేదు కానీ అనధికారికంగా మాత్రం ఈమె బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్ పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఈమెపై స్టార్ మా యాజమాన్యంతో పాటు నిర్వాహకులు కూడా సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అసలు విషయం ఏమిటంటే బిగ్‌బాస్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఒక రోజు ఆలస్యంగా ప్రసారమవుతుంది. అంటే అక్కడ ఆదివారం జరిగేది మనకు సోమవారం వస్తుంది అన్నమాట. అంటే ఎలిమినేషన్ కూడా శనివారం జరిగితే మనకు ఆదివారం ప్రసారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇంటి నుంచి బయటికి వచ్చేసింది కాజల్. ఈ విషయం 24 గంటల వరకు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్ పై ఉంటుంది. సోషల్ మీడియాలో ఎలాంటి లీక్ వచ్చిన సంబంధం లేదు కానీ.. తమకు తాముగా బయటికి వచ్చి ఎలిమినేట్ అయిన విషయం చెప్పకూడదు. అయితే కాజల్ మాత్రం కాస్త తొందర పడింది. ఈమె ఎలిమినేషన్ తర్వాత నేరుగా వచ్చి యూట్యూబ్ లైవ్ లో కూర్చుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. దాంతో ఈ వారం కాజల్ బయటకు వస్తుంది అని అందరికీ ముందుగానే తెలిసిపోయింది.
నిజానికి ఆదివారం ఎపిసోడ్ పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్ బయటికి రావాలి. అది కూడా స్టార్ మా నిర్వహించే బజ్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మిగిలిన ఇంటర్వ్యూలకు కానీ.. సోషల్ మీడియా లైవ్‌కు కానీ రావాలి. కానీ కాజల్ మాత్రం యూ ట్యూబ్ లో కనబడింది. అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇక్కడే బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బజ్ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు బయట కనిపించకూడదనే విషయం మీకు తెలియదా అంటూ ఆమెను నిలదీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై కాజల్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dhee14: సుధీర్-రష్మీ జంట ఔట్.. అఖిల్- మోనాల్ జోడి ఇన్..!
కవలలకు జన్మినిచ్చిన లోబో భార్య.. చిరంజీవి ఆశీర్వదించాడంటూ పోస్ట్
Sunny: సెకండ్ ఫైనలిస్ట్‌ని ప్రకటించిన నాగ్.. ఈ వారం ఆమె ఎలిమినేషన్ పక్కా…!
Bigg boss: హిట్ స్టార్ ఎవరు, ఫ్లాప్ స్టార్ ఎవరు?
Shanmukh: సిరి విషయంలో రిగ్రెట్ అయిన షణ్ముఖ్.. తన బాధలను చెప్పుకున్న సన్నీ
Sunny: కాజల్ విఫలమైందంటూ సిరి ఫైర్..బైక్ ఎక్కి ఫోజులు ఇచ్చిన సన్నీ
Kajal: కాజల్, శ్రీరామ్ మధ్య స్ట్రాంగ్ డిస్కషన్.. హౌజ్ అంతా సైలెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

