శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఎప్పటి మాదిరిగానే హౌజ్‌మేట్స్‌తో కొన్ని గేమ్స్ ఆడించాడు. పెద్దగడియారం లాంటిది పెట్టి ఈ పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన క్షణాలతో పాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు గురించి కన్ఫెషన్ రూంలోకి వచ్చి చెప్పాలని అన్నాడు. ముందుగా కాజల్.. 9వ వారంలో జరిగిన ఎలిమినేషన్ గురించి చెబుతూ బాధపడింది. సన్నీ, మానస్‌ను సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ శ్రీరామ్‌ని సేవ్ చేశాను. ఎవరో గుర్తు చేస్తే నన్ను సేవ్ చేశావని అతడూ హ్యాపీగా లేడు. ఇది నన్ను అప్సెట్ చేసింది.
ఇక తర్వాత వచ్చిన షణ్ముఖ్.. సిరి విషయంలో రెండు జరిగాయి. 11వ వారంలో నా వల్ల సిరి తలబాదుకోవడం నచ్చలేదు. 14వ వారం టాప్ 5 గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను. హౌస్మేట్స్ ఏం చేసినా, ఏం మాట్లాడినా గేమ్ గురించేనేమో అని అనుమానపడి సిరిని కొన్ని విషయాల్లో ఆపాను. అయితే ఆమెకు సాయం చేద్దామనేదే నా ఉద్దేశ్యం. సిరిని టాప్ 5లో చూడడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని షణ్ముఖ్ అన్నాడు.
ఇక సన్నీ మాట్లాడుతూ 12వ వారంలో నా వలన సిరి చాలా హర్ట్ అయిందని బాధపడ్డాడు. నేను అగ్రెసివ్ అయి గేమ్ ఆడాను. దీనివల్ల సిరి ఐస్బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా ఆడింది. దీంతో వారమంతా సఫర్ అయింది. అది నా వల్లే అనిపించింది. మరొకటి గిల్టీబోర్డు వేసుకున్నది కూడా మర్చిపోలేను’ అని తెలిపాడు. అలా గిల్టీ బోర్డ్‌తో ఉండడం చాలా బాధించింది. ఇక మీ వల్ల, నా అంతట నేను కొంత నేర్చుకొని కొంత కమ్ బ్యాక్ అయ్యాను అని సన్నీ అన్నాడు.