Bigg Boss Telugu 8 | బుల్లితెర ఆడియన్స్ ఫేవరేట్ షో బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ తొమ్మిదో వారం చివరిరోజుకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ దిల్ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈవారం నామినేషన్స్ చూసుకుంటే గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి సంబంధించిన ఓటింగ్ కూడా శుక్రవారం ముగిసింది. అయితే గతవారం నామినేషన్స్‌లో ఉండి టాప్‌లో నిలిచిన యష్మీ ఈ వీక్ ఓటింగ్‌లో కూడా టాప్‌లో దూసుకెళుతోంది. అయితే ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ఊహించని విధంగా గౌతమ్ టాప్ ప్లేస్‌లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న యష్మి రెండో ప్లేసుకు పడిపోయినట్లు తెలుస్తోంది.
గతవారం ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న నయని ఈ వారం ఏకంగా మూడో స్థానంలోకి వచ్చింది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈవారం హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. పానిపట్టు టాస్క్ లో యష్మి చూపించిన జోష్ ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ అనంతరం యష్మి, నిఖిల్‌కి మధ్య జరిగిన వాదన యష్మీ నిఖిల్ పై అరవడం, దానికి నిఖిల్ ఏడవడం వంటి అంశాలు యష్మీ పై ప్రేక్షకులలో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని టాక్. మరోవైపు సడన్‌గా యష్మి ఓటింగ్‌లో రెండో ప్లేసుకు పడిపోవడం కూడా దీనికి కారణం అని తెలుస్తుంది. కాగా దీనిపై మరికొన్ని గంటల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది.