Bigg Boss Telugu 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 46వ రోజు పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది. హోస్ట్ కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో సాగుతున్న ఈ షోలో, ప్రతి రోజూ కొత్త టాస్కులు, సర్ప్రైజ్ ఎంట్రీలతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. తాజా ఎపిసోడ్లో ఫన్నీ గేమ్స్, గొడవలు, సర్ప్రైజింగ్గా పోలీస్ ఎంట్రీ అన్నీ కూడా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. ఎపిసోడ్ ప్రారంభంలో డస్ట్ బిన్ విషయంలో సంజన, దివ్య మధ్య మాటల తూటాలు పేలాయి. చెత్తను సమయానికి క్లిన్ చేయలేదని సంజన ఫైర్ అయింది. దీనిపై దివ్య “చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, అడ్జస్ట్ అవ్వాలి” అంటూ కౌంటర్ ఇచ్చింది. “నేను అన్ని డిపార్ట్మెంట్స్లో వేలు పెడితే తప్పులు బయటపడతాయి” అంటూ దివ్య వార్నింగ్ ఇవ్వడంతో సన్నివేశం హాట్‌గా మారింది.
తర్వాత బిగ్ బాస్, సంజన బ్లూ టీం మరియు మాధురి రెడ్ టీంల మధ్య ఒక ఫన్నీ టాస్క్‌ను ప్రకటించారు. కంటెస్టెంట్స్ నోటిలో నీళ్లు నింపుకుని బకెట్లో ఊయాలి. ఎవరు ఎక్కువ దూరం ఉన్న బకెట్లో నీళ్లు పడేస్తే వారు గెలుస్తారు. బ్లూ టీం నుంచి ఆయేషా, రెడ్ టీం నుంచి రీతూ మొదటి రౌండ్లో పోటీ పడ్డారు. ఆయేషా ఇటీవల అనారోగ్యంతో బాధపడినప్పటికీ, “ఇప్పుడు బాగున్నాను” అంటూ గేమ్‌లో పాల్గొంది. ఆమె అద్భుత ప్రదర్శనతో రీతూపై విజయం సాధించింది. వరుస విజయాలతో బ్లూ టీం మొత్తం గేమ్‌లో గెలిచి సంబరాలు చేసుకుంది. ఓడిపోయిన మాధురి టీంకు బిగ్ బాస్ సరదా పన్నిష్మెంట్ ఇచ్చారు. మోకాళ్లపై నిలబడి సంజన టీంను పొగడాలి! ఈ పనిష్మెంట్తో హౌస్‌లో నవ్వులు పూశాయి.
ఎపిసోడ్ క్లైమాక్స్‌లో బిగ్ బాస్ సర్ప్రైజ్ ఎంట్రీని ప్లాన్ చేశారు. మాజీ కంటెస్టెంట్స్ అర్జున్ అంబటి, అమర్ దీప్ పోలీస్ గెటప్స్‌లో హౌస్‌లోకి వచ్చి మజా మసాలా పెంచారు. మారు వేషాల్లో ఉన్న సంజన, మాధురిలను పట్టుకోవడమే వారి టాస్క్. ఇద్దరూ కంటెస్టెంట్స్‌తో చమత్కారంగా ఎంక్వైరీ చేస్తూ హౌస్ మొత్తాన్ని నవ్వులతో నింపేశారు. చివరికి సులభంగానే మాధురి, సంజన లను పట్టుకుని టాస్క్ పూర్తి చేశారు. ఈ ఎపిసోడ్లో గొడవ, గేమ్, ఫన్, సర్ప్రైజ్ అన్ని సరదా సరదాగా ఉండటంతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లభించింది.