Bigg Boss Telugu 9 | నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో మూడువారాలు పూర్తి చేసుకుని నాలుగో వారం ప్రారంభమైంది. ఇప్పటివరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి ఎలిమినేట్ కాగా, సంజనా మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత హౌజ్‌మేట్స్ త్యాగాల వల్ల తిరిగి హౌజ్‌లోకి వచ్చింది. అయితే ఆమె రీఎంట్రీ తర్వాత హౌజ్‌లో ఫుడ్ ఇష్యూలపై రచ్చ ఆగడం లేదు.సోమవారం (22వ ఎపిసోడ్)లో సంజనా కిచెన్ విషయంలో పెద్ద గొడవ చేసింది. కుకింగ్ బాధ్యతలో ఉన్న దివ్యను పక్కన పెట్టి, తనకు శ్రీజతోనే పోపు పెట్టించుకోవాలని పట్టుబడింది.
కొత్త రేషన్ వస్తే దానిని చూసి కుక్ చేస్తామని తనూజ చెప్పినా, పాత ఐటెమ్స్తోనే తాను తినేస్తానంటూ వాదన కొనసాగించింది. చివరికి తనూజ, కెప్టెన్ డీమాన్ పవన్ మాటలు వినకపోవడంతో ఫుడ్ తిననని సంజనా అలిగిపోయి మారాం చేసింది. ఇక బిగ్ బాస్ నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు హౌజ్‌మేట్స్‌కు ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు. ఆరు టీములుగా విడిపోయి బోర్డ్స్ మీద బ్లాక్స్ పగలగొట్టి స్టార్లను తెచ్చుకోవాల్సిన టాస్క్‌లో సుమన్ శెట్టి-దివ్య జంట విజయం సాధించింది. తర్వాతి రౌండ్లో వారు తనూజ, ఫ్లోరాను ఎంపిక చేయగా, ఫైనల్లో తనూజ, సుమన్ శెట్టి విజయంతో ఇమ్యూనిటీ బ్యాడ్జ్‌లను గెలుచుకున్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ నుంచి వీరిద్దరూ సేఫ్ అయ్యారు.
అంతలో సంజనా ప్రవర్తనపై ఇమ్మాన్యుయెల్ సెటైర్లు వేశారు. ఆమె గేమ్ ఆడకుండా గొడవలతో కెమెరాల్లో ఫోకస్ కావాలని ప్రయత్నిస్తోందని కామెంట్ చేశారు. ఇక కెప్టెన్ పవన్, గతవారం దొంగతనం చేసిన వారికి శిక్ష అనే చర్చలో కూడా సంజనాతో ఘర్షణ పడ్డాడు. తాను అనుకుంటే ఆమెను జైల్లో పెట్టగలనని పవన్ అన్న మాటలపై సంజనా తీవ్రంగా స్పందించింది. మొత్తం మీద, నాలుగో వారం స్టార్ట్ అయినా, సంజనా రచ్చ, ఇమ్యూనిటీ టాస్క్‌లో సేఫ్ అయిన తనూజ, సుమన్ శెట్టి ప్రధాన హైలైట్స్‌గా నిలిచారు.