Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 18వ రోజు ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చాడు బిగ్ బాస్. ఎప్పటిలాగే ఫుడ్ పై గొడవలతో రోజు ప్రారంభమైనా, మధ్యాహ్నానికి హౌస్‌లో కొత్త డ్రామా మొదలైంది. ఉదయం సంజనకి కాఫీ ఇచ్చినందుకు రాము మీద తనూజ గట్టిగానే ఫైర్ అవ్వగా, ఇమ్మాన్యూయేల్ మధ్యలో వచ్చి తనూజని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు. హౌస్‌లోకి దివ్య నిఖిత, షకీబ్, నాగ, అనూష లు “అగ్నిపరీక్ష సభ్యులు”గా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరికి వైల్డ్ కార్డు అవకాశం ఇవ్వబడుతుందని, ఆ నిర్ణయం హౌస్ మేట్స్ చేతుల్లోనే ఉందని బిగ్ బాస్ ప్రకటించారు.
సభ్యులు తమ గేమ్ స్ట్రాటజీ, హౌస్‌లో ఉన్న లోపాలను సరిచేసే విధానాన్ని వివరించారు. ప్రశ్నోత్తరాల్లో అనూష శ్రీజను స్వాప్ చేస్తానని చెప్పి వివాదం రేపింది. నాగ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకోగా, దివ్య కూడా శ్రీజపై విమర్శలు గుప్పించింది. అగ్నిపరీక్ష సభ్యుల మధ్య హౌస్మేట్స్ సీక్రెట్ ఓటింగ్ జరిపారు. అందులో దివ్యకి వైల్డ్ కార్డు అవకాశం దక్కింది. కానీ బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. దివ్యకి అసలు ఎక్కువ ఓట్లు రావలేదని, తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఆమెనే ఎంపిక చేశామని స్పష్టం చేశారు. ఇది చదరంగం కాదు… రణరంగం. కాబట్టి నేను అనుకున్నట్టే జరుగుతుంది” అంటూ బిగ్ బాస్ మాటలు హౌస్‌లో కొత్త చర్చలకు దారితీశాయి.
దివ్య హౌస్‌లో అడుగుపెట్టడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారబోతోందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న గ్రూపుల మధ్య ఈక్వేషన్స్ ఎలా మారతాయో, కొత్తగా ఎలాంటి విభేదాలు ఏర్పడతాయో చూడాలి. అయితే ఇక తన బెడ్ దగ్గర సర్దుకుంటూ కెమెరాతో మాట్లాడింది దివ్య. లవ్ ట్రాక్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే ఈ ఒక్క దానికి నలుగురు షేక్ అయ్యారు హౌస్‌లో.. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ల బిహేవియర్ ఎలా మారుస్తారో ఏంటి అని ఆడియన్స్ చూడాలి.. అప్పుడు ఎవరు ఎంత జెన్యూన్.. ఎవరు ఊరికే ఫుటేజ్ కోసం లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటో మరి తెలీదు కానీ అది తెలుసుకుందామని ఒక రాయి వేశా.. జనాల ముఖాలు మాడిపోయాయి.. అంటూ దివ్య మాట్లాడింది.