Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదోవారం చివరిరోజుకి చేరుకుంది. గతవారం హౌజ్ నుంచి సోనియా ఆకులను బయటకు పంపిన బిగ్ బాస్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయనున్నారని అటు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ శనివారం ఇంటికి వెళ్లనున్నారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు నాగార్జున అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండనున్నట్లు నాగార్జున తెలిపాడు. ఈ సందర్భంగా కొత్త ప్రోమోలను విడుదల చేశారు.
శనివారంకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలను తాజాగా బిగ్ బాస్ నిర్వహాకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో గుర్తు పెట్టుకోండి ఇవాళే మీకు ఆఖరి రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా అని నాగార్జున కంటెస్టెంట్లతో అనడం చూడవచ్చు. దీంతో ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరో ప్రోమోలో నాగా మణికంఠపై నాగార్జున సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అతడిని యాక్షన్ రూమ్‌లోకి పిలిపించుకోని ఎంత ఏడుస్తావో ఏడువు అంటూ ఈ ప్రోమోలో చెప్పడం చూస్తుంటే శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగబోతున్నట్లు తెలుస్తుంది.