Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదోవారంకు చేరుకుంది. గతవారం హౌజ్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్‌మేట్స్‌తో ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఆమెను హౌస్ నుంచి బయటకు పంపిచేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ శనివారం ఇంటికి వెళ్లనున్నారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు నాగార్జున అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా ఆరుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే తాజాగా ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వహాకులు. అయితే ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్ అందరినీ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌కు రమ్మని పిలిచాడు బిగ్ బాస్. అయితే యష్మి కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లిన అనంతరం ఆమెను అడుగుతూ.. మీకు హౌస్‌లో నచ్చినవారు ఎవరు అని అడుగుతాడు. దానికి యష్మి పృథ్వీ అలాగే నిఖిల్ అని సమాధానమిస్తుంది. ఆ తర్వాత మణికంఠను అడుగగా.. నబీల్ అని చెబుతాడు. అయితే ఈ టాస్క్ అనంతరం కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న యష్మిని తన ఎదురుగా ఉన్న క్లాత్ తీయమని అడుగుతాడు. ఆ క్లాత్ తీయగానే అందులో నిఖిల్‌తో పాటు మణికంఠకు ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, దానితో పాటు ఓ మెసేజ్ కూడా వచ్చినట్లు చెప్పారు. అయితే మణికంఠ బిగ్ బాస్ చెప్పింది విని ప్రియా(మణికంఠ భార్య) ఇండియాకు వచ్చిందా అని షాక్ అవుతాడు.
అయితే బిగ్ బాస్ యష్మిని ఆ ఇద్దరిలో ఫుడ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నాడు. అయితే యష్మి మాత్రం నేను నిఖిల్‌కు మాత్రమే ఇస్తానని చెబుతుంది. దీంతో మణికంఠ ప్లీజ్ యష్మీ అంటూ రిక్వెస్ట్ చేయడం కనిపిస్తుంది. పైగా బిగ్‌బాస్ కూడా మణికంఠ గురించి ఏం ఆలోచించాలనుకోవడం లేదా అంటూ యష్మీతో అన్నా.. సారీ బిగ్‌బాస్.. నేను నిఖిల్‌కే ఇస్తా అని చెప్పేసింది. అయితే ఈ మాటలు విన్న నాగ మణికంఠ.. యష్మీ ఐ నీడ్ దట్ మెసేజ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.