Bigg Boss Tamil | సూపర్ పాపులారిటీ ఉన్న ఇండియన్ టీవీ రియాలిటీ షోల్లో టాప్‌లో ఉంటుంది బిగ్‌బాస్ షో (Bigg Boss). కొత్త కొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్, కాంట్రవర్సీస్, వినోదాలతో సాగుతూ అందరినీ టీవీలకు కట్టిపడేస్తుంటుంది. ఈ షోకి సంబంధించి తెలుగు (Telugu Bigboss)లో సీజన్ 7 వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ్ బిగ్‌బాస్ (Bigg boss Tamil) షోకి సంబంధించి కూడా కొత్త సీజన్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సీజన్ 7కు కూడా హోస్ట్‌గా లోకనాయకుడు కమల్ హాసన్ కనిపించబోతున్నారు. తమిళ్ బిగ్ బాస్ గత ఆరు సీజన్లకు కూడా కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక సీజన్ 7కు సంబంధించి కమల్ హాసన్ ఉన్న ఓ ప్రోమో విడుదల చేశారు. తాము ఎల్లప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటాము అంటూ కమల్ హాసన్ చెబుతున్నట్లు ఈ ప్రోమో సాగింది. కాగా ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
Bigg Boss Tamil Season 7
விரைவில்..@vijaytelevision @disneyplusHSTam #BBTamilSeason7 #பிக்பாஸ் pic.twitter.com/xTDjA6JqWj— Kamal Haasan (@ikamalhaasan) August 18, 2023