విదేశాలలో మొదలైన బిగ్ బాస్ షో మన దేశంలో ముందుగా హిందీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఐదో సీజన్‌కి సిద్ధమైంది. కరోనా వలన కాస్త లేట్‌గా ప్రారంభం కానున్న ఈ షోకి సంబంధించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 5కి ముందుగా రానా హోస్ట్ అన్నారు, కాని ప్రోమో విడుదలైన తర్వాత మళ్లీ నాగార్జుననే హోస్ట్ చేయనున్నారని కన్ఫాం అయ్యారు. ఇక కంటెస్టెంట్ల గురించి పక్కా క్లారిటీ లేదు కాని ఇందులో పాల్గొనబోయే ఫైనల్ లిస్ట్ ఇదే అని కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ , సింగర్ కోమలి, వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పేర్లు వినిపిస్తున్నాయి.
ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్ కి ఉంచుతున్నట్టు తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 5 నుండి షో ప్రారంభం కానుందని తాజాగా ప్రకటించారు నిర్వాహకులు. అంటే సెప్టెంబర్ 4నే షోకి సంబంధించిన షూట్ పూర్తవుతుంది. తొలి ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ పరిచయం కార్యక్రమం ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 10గం.లకు ఈ షో ప్రసారం కానుండగా, శని,ఆదివారాలలో 9గం.లకు మొదలు కానుంది.