Lahari Shari | బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యింది లహరి షారీ. సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి షారీ కేవలం మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. ఇంకొన్ని వారాలు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటుందని అనుకున్నా కూడా అనుకోని విధంగా మూడు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. అయినా కూడా నాగార్జున దృష్టిలో పడింది. మొన్న సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న లహరి షారీకి.. ఈ ఇంటర్వ్యూ బాగా హెల్ప్ అయ్యింది. ఒకరోజు మొత్తం నాగార్జున, నాగచైతన్యతో ఫ్లైట్‌లో ఉండటం.. ఇంటర్వ్యూ చేయడం జీవితంలో మరిచిపోలేని అనుభవం అంటూ అభిమానులతో పంచుకుంది లహరి షారీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఖరీదైన కారు కొనుగోలు చేసింది.
మహాశివరాత్రి సందర్భంగా లగ్జరీ కారు వోల్వో ఎక్స్‌సీ 60ని తనకు తాను బహుమతిగా ఇచ్చుకుంది లహరి షారీ. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కారు ముందు నిల్చుని ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర ఎంత కాదన్నా 60 లక్షల వరకు ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్‌ను కూడా లహరి షారీ కొనుగోలు చేసింది. కాగా బిగ్‌బాస్ తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్‌లో నటించిన లహరి షారీ పలు సినిమాలకు సైతం సంతకం చేసింది.