Bigg Boss | ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు ఎంతటి భయానకం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరదా కోసం అక్కడికి వచ్చిన వారిని మతం అడిగి మరీ చంపేశారు. అయితే చనిపోయిన పర్యాటకులలో వినయ్ నర్వాల్ అనే లెఫ్టినెంట్ ఉన్నారు. 26 ఏళ్ల వినయ్ తన భార్య హిమాన్షితో హనీమూన్ కోసం అక్కడికి రాగా, ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. ఏప్రిల్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వివాహం చేసుకున్న అతను ఆరు రోజుల తర్వాత కన్నుమూసాడు. 2022లో నేవీలో చేరిన తర్వాత నర్వాల్ గత ఒకటిన్నర సంవత్సరాలు కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేశారు.
అయితే కొద్ది రోజులుగా వినయ్ నర్వాల్ సతీమణి హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 19 ఈ నెల ఆగస్ట్ 24న ప్రారంభం కానుండగా, కంటెస్టెంట్ల జాబితాకి సంబంధించి ఆసక్తికరమైన ప్రచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు హిమాన్షి నర్వాల్ . ఈమె పేరు వినగానే చాలా మంది భావోద్వేగానికి లోనవుతున్నారు, ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన విషాదకర ఘటన దేశాన్ని కదిలించింది. ఉగ్రదాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోగా, హిమాన్షి మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఘటన తర్వాత భర్త పక్కన కన్నీటితో విలపిస్తున్న హిమాన్షి ఫోటోలు దేశమంతా చర్చనీయాంశంగా మారాయి.
బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, బిగ్‌బాస్ మేకర్స్ ఈసారి హిమాన్షి పేరు కూడా పరిగణనలోకి తీసుకున్నారని టాక్. ఆమె కథకు ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.. షో నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే బిగ్‌బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ ..హిమాన్షి యాదవ్ తన వ్లాగ్‌లో ఆమె తన కాలేజ్ మేట్ అని చెప్పాడు. 2018లో కాలేజ్ పూర్తయ్యాక మేము మాట్లాడలేదు. కానీ ఆమె చాలా మంచి వ్యక్తి. ఆ సమయంలో కాల్ చేయడం సాధ్యం కాలేదు అంటూ ఎల్విష్ పేర్కొన్నాడు. అయితే బిగ్‌బాస్ 19లో హిమాన్షి నర్వాల్ నిజంగా ఎంట్రీ ఇవ్వనున్నారా లేదా? అన్న దానిపై ఖచ్చితమైన స్పష్టత షో ప్రారంభానికి ముందు వచ్చే అవకాశం ఉంది.