బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్ని టైటిల్ దక్కించుకోవడం అంత ఆషమాషీ కాదు. ఎన్నోటాస్క్లు ఆడాలి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి, వేరే వేరే వ్యక్తిత్వం ఉన్న హౌజ్‌మేట్స్‌తో సెట్ అయిపోవాలి. ఇలా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ సరైన దిశలో ముందుకు సాగితే కాని టైటిల్ దక్కదు. తాజా ఎపిసోడ్లో బిగ్ బాస్‌కి ఆకలిమంట ఏంటో తెలియజేశాడు.
ఓ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులంతా ఇద్దరిద్దరు చొప్పున జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాజల్-జెస్సీ, షణ్ముఖ్- సిరి, లోబో- నటరాజ్, రామ్ -హమీదా, శ్వేతా-ఆనీ మాస్టర్, ప్రియ- ప్రియాంక, రవి – విశ్వ, సన్నీ – మానస్ ఇలా హౌస్ మొత్తం ఎనిమిది జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్నారు.అయితే లోబో ఆకలికి తట్టుకోలేకపోయిన లోబో మాడిపోయాడు.
ఇకపై ఎక్కడైనా ఎవరైనా అన్నం పడేస్తూ కనిపిస్తే గుద్దుతా అని చెప్పాడు లోబో. ఆకలి బాధని తెలియజేస్తూ సందేశాత్మకంగా మెసేజ్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, లోబో, విశ్వ, ప్రియలు ఎమోషనల్‌గా టాస్క్ చేసి ఏడిపించేశారు. ఆకలి రాజ్యం స్పూఫ్‌తో అదరగొట్టేశాడు. అయితే బిగ్ బాస్ ఎవరు ఆహారం తీసుకోవద్దని చెప్పినా కూడా సన్నీ సీక్రెట్‌గా ఆహారం తీసుకోవడంతో కెప్టెన్‌గా ఉన్న జెస్సీ విఫలం అయ్యాడని బిగ్ బాస్ తెలియజేశాడు.
జెస్సీ అతనితో పాటు అతనికి జోడీగా ఉన్న కాజల్ కూడా కెప్టెన్ పోటీదారులుగా ఉండే అవకాశాన్ని కోల్పోయారని.. వాళ్లిద్దరూ కేవలం సంచాలకులుగా మాత్రమే ఉంటారని చెప్పారు బిగ్ బాస్. అయితే కెప్టెన్‌గా ఉన్న తన మాట ఎవరు వినడం లేదని జెస్సీకి చిర్రెత్తుకొచ్చి హంగామా సృష్టించాడు.