Bigg Boss | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ నెల 7వ తేదీ నుంచి గ్రాండ్గా ప్రారంభంకానుంది. ఈసారి షో మరింత ఆసక్తికరంగా ఉండేలా మేకర్స్ పకడ్బందీ ప్లాన్ చేశారు. ఓవైపు కామనర్స్ ఎంపికకు ‘అగ్నిపరీక్ష’ పేరుతో సెపరేట్ ఆడిషన్లు జరుపుతుండగా, మరోవైపు సెలెబ్రెటీ కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తి పెరిగిపోయింది. ఈసారి ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖాలతోనే షోను ముందుకు తీసుకెళ్లాలని షో నిర్వాహకులు భావిస్తున్నారని టాక్. సినీ ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు నుంచి సోషల్ మీడియా సెలబ్రిటీల వరకూ పలు ఆసక్తికరమైన పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిక్కీ గల్రాని (ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్)
ఆశా షైనీ (‘నరసింహ నాయుడు’ లో ‘లక్స్ పాప’ సాంగ్ ఫేమ్)
నవ్యస్వామి (‘నాపేరు మీనాక్షి’, ‘కంటే కూతురునే కనాలి’ సీరియల్స్ తో గుర్తింపు పొందిన నటీమణి)
ముఖేష్ గౌడ (‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో)
శ్రిష్టి వర్మ (జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన కొరియోగ్రాఫర్)
తేజస్విని గౌడ (‘కోయిలమ్మ’ ఫేమ్, అమరదీప్ భార్యగా గుర్తింపు)
కావ్య (‘బ్రహ్మముడి’ సీరియల్ నటి)
రాము రాథోడ్ (‘రాను బొంబాయికి రాను’ పాటతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సింగర్)
ఇమ్యానుయేల్ (జబర్దస్త్ కమెడియన్)
అలేఖ్య చిట్టి (‘పికిల్స్ అమ్మాయి’గా పాపులర్)
ఈ పేర్లన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిలో నిజంగా ఎవరు హౌస్లో అడుగుపెడతారో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7న షో ప్రారంభం వరకు వేచి చూడాల్సిందే.ఇప్పటివరకు షో నిర్వాహకులు ఈ లిస్టులోని ఎటువంటి పేరుపైనా అధికారికంగా స్పందించలేదు. కానీ గత సీజన్లను బట్టి చూస్తే, ఇలా ముందుగానే లీక్ అయిన పేర్లలో చాలా వరకూ నిజమవుతుంటాయి. ఈ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్తో నిండిపోనుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.