ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్నాడు అమిత్‌తివారీ. తెలుగు బిగ్‌బాస్‌తో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడు. సినిమాలో అమిత్‌తివారీ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనలను చూపిస్తున్నాం. నల్లమల భూమి బిడ్డగా అమిత్ కనిపిస్తారు. ఆయుధ తయారీ కోసం నల్లమలకు వచ్చిన ఇరాన్ సైంటిస్ట్‌ల కుట్రలను అమిత్‌తివారీ ఎలా ఎదిరించాడు? అటవీ సంపదను ఎలా కాపాడాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్, నిర్మాత: ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవిచరణ్.