Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతోంది. తాజాగా శనివారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠ కలిగించింది. ఈ వారం అత్యుత్తమ ప్రదర్శనతో ఇమ్మాన్యుయేల్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గోల్డెన్ స్టార్ల జాబితాలోకి ఎక్కిన అతను, పవర్ అస్త్ర పోటీలో కూడా తనదైన ముద్రవేశాడు. రాము, కళ్యాణ్, తనూజ, దివ్య, భరణి లతో కలిసి పవర్ అస్త్ర పోటీలో తలపడ్డాడు.గోల్డెన్ స్టార్ల ఫోటోల ముందున్న కీలు ద్వారా పవర్ అస్త్ర కోసం పోటీ విధానం కొనసాగింది. కన్ఫెషన్ రూమ్ లోకి ప్రవేశించిన తనూజ, రాము కీని బ్రేక్ చేసింది. “రాము గేమ్ లో కన్సెస్టెన్సీ చూపడం లేదు, స్టాండ్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా” అని పేర్కొంది.
శ్రీజ ఆటపై ప్రశంసలతో పాటు, ఆమె మాట్లాడే తీరు పట్ల నాగార్జున క్లారిటీ ఇచ్చారు. “గేమ్ లో టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. కానీ మాట్లాడాల్సిన చోట నోరు మూసుకుంటూ, మాట్లాడకూడని చోట మాట్లాడుతూ సమస్యలు తెచ్చుకుంటోంది” అంటూ హెచ్చరించారు. శ్రీజ, రీతూ చౌదరి మధ్య ఉన్న టెన్షన్‌ను నాగ్ లేవనెత్తారు. శ్రీజ – “పవన్ మాకు సపోర్ట్ చేస్తుండటం రీతూకి ఇష్టం లేదు. అందుకే నన్ను టార్గెట్ చేస్తోంది” అని వెల్లడించగా, నాగార్జున రీతూ పై సెటైర్లు వేసారు. “ఆడే వాళ్ళని చెడగొడుతూ గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నావు” అని అభిప్రాయపడ్డారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి అత్యంత దగ్గరగా ఉన్నవారు రీతూ చౌదరి మరియు ఫ్లోరా షైనీ. వీరిలో ఎవరు ఇంటి నుంచి బయట పడతారో ఆదివారం ఎపిసోడ్ లో తేలనుంది.
ఐదోవారం నామినేషన్స్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్‌కి హోరా హోరీగా ఓటింగ్ జరిగింది. పది మంది ఓటింగ్‌లో ఉండడంతో అతి తక్కువ మార్జిన్‌తో చివరి వరకూ ఐదురుగు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. నామినేషన్లో దమ్ము శ్రీజ, భరణి, తనూజ, దివ్య, డెమోన్ పవన్, కళ్యాణ్ పడాల,ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి,సంజన, రీతూ చౌదరి ఉన్నారు. వీరిలో శ్రీజని ఎలిమినేట్ చేసి రీతూని సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారనే టాక్ నడుస్తుంది. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండొచ్చనే టాక్ నడుస్తుంది. మరి కొద్ది గంటలలో వీటిపై క్లారిటీ రానుంది.