Bigg Boss 9 | బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ జరుపుకునేందుకు రెడీ అయింది. బిగ్ బాస్ షోలో వివాదాలు, కాంట్రావర్సీలు, రిస్క్ గేమ్స్, ఆటలు, పాటలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే ఈ షోని చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వాళ్లు కూడా ఫాలో అవుతుంటారు. తెలుగు టీవీలో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ఒకటైన ఈ బిగ్ బాస్ షో 2017లో ప్రారంభం కాగా, ప్రతి ఏడాది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకులకి వినోదం పంచుతూనే ఉంది.
బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఏర్పాట్లు షురూ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోలో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి సెట్ వర్క్ స్టార్ట్ కాగా, ఇదంతా కూడా సెప్టెంబర్ వరకు పూర్తి కానుందట. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటి వారం అంటే 2025, సెప్టెంబర్ 07 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది కొన్ని రోజులుగా సీజన్ 9 గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాలలో చక్కర్లు కొడుతుంది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఆతరువాత సెకండ్ సీజన్, 6,7 సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో సీజన్ 8 ని కొంత డిఫరెంట్‌గా ప్లాన్ చేసి పర్వాలేదనిపించారు.
మొత్తానికి ఎనిమిదో సీజన్ బాగుందనే కామెంట్స్ అయితే వినిపించాయి. మరి ఇప్పుడు సీజన్ 9ని మరింత ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో హోస్ట్‌ని మారిస్తే బాగుంటుందా, లేకుండే నాగార్జునతోనే కొనసాగిస్తే బెటరా అనే చర్చ నడుస్తుంది. మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకూ విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున.అయితే ఒకటీ రెండు సీజన్లు నాగార్జున కాస్త తడబడ్డా పర్వాలేదనిపించాడు. అయితే ఈ సీజన్ కోసం విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వినిపించాయి. నాగార్జుననే ఫైనల్ అంటున్నారు. ఇక ఈ సీజన్లో కుమారి ఆంటీ, ఉదయభాను, బమ్ చిక్ బబ్లూ, అలేఖ్య పికిల్స్ రమ్య మోక్షతో పాటు పలువురు యూట్యూబర్ల పేర్లు కూడా కంటెస్టెంట్స్‌గా పాల్గొననున్నారని అంటున్నారు.