Bigg Boss 9 | హోస్ట్ కింగ్ నాగార్జున సారథ్యంలో కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. 60వ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. హౌస్‌లో ఫన్నీ మూమెంట్స్‌తో పాటు రెబల్స్ చేసిన సీక్రెట్ టాస్క్‌లు ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. బుధవారం జరిగిన టాస్క్‌లో ఆరెంజ్ టీం విజయం సాధించి తమ టీమ్ సభ్యురాలు తనూజకి సేఫ్ గార్డ్ ఇచ్చారు. మరోవైపు హౌస్‌లో రెబల్స్‌గా ఉన్న దివ్య, సుమన్ శెట్టిలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఎవరికీ తెలియకుండా తెలివిగా పూర్తి చేశారు. ఈ దశలో బిగ్ బాస్, సుమన్ శెట్టిని ఫోన్ ద్వారా సంప్రదించి “మీ పని పూర్తయింది” అని తెలిపి, కొత్త రెబల్‌గా రీతూ చౌదరిని నియమించారు.
రీతూకి బిగ్ బాస్ ఇచ్చిన మొదటి సీక్రెట్ టాస్క్ .. హౌస్‌లో ఎవరితోనైన కావాలనే సీరియస్‌గా గొడవ పెట్టుకోవడం. ఆ తర్వాత కంటెండర్ రేసు నుంచి ఒకరిని తప్పించాలి. మొదట గౌరవ్‌తో వాగ్వాదం ప్రయత్నించినా కుదరలేదు. చివరికి ఇమ్మాన్యుయేల్‌తో గొడవ పెట్టుకుని, సాయిని కంటెండర్ రేసు నుంచి తొలగించినట్లు ప్రకటించింది.తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన రిలే టాస్క్‌లో ఆరెంజ్, బ్లూ, పింక్ టీమ్స్ పోటీ పడ్డాయి. ఆరెంజ్ టీమ్‌కి చెందిన ఇమ్మాన్యుయేల్, గౌరవ్ కాంబో అద్భుతంగా ఆడి విజయం సాధించారు. దీంతో సేఫ్ గార్డ్ వారికి లభించింది. అయితే, సేఫ్ గార్డ్ ఎవరికివ్వాలనే దానిపై టీంలో చిన్నపాటి వాగ్వాదం జరిగినా, చివరికి గౌరవ్‌కు సేఫ్ గార్డ్ దక్కింది.
ఇంతలో హౌస్‌లో కొత్తగా రెబల్ ఎవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది సంజనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత రీతూకి రెండవ సీక్రెట్ టాస్క్‌గా ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫొటో దాచిపెట్టడం అప్పగించబడింది. దాన్ని కూడా ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. తరువాత బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌తో “రెబల్ ఎవరో” గెస్ చేయమని చెప్పారు. చాలా మంది గౌరవ్ పేరు చెప్పినా, చివర్లో బిగ్ బాస్ అసలైన రెబల్స్‌ని రివీల్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తం మీద ఈ వారం ఎపిసోడ్లో భరణి, తనూజ, సుమన్, దివ్య, ఇమ్మాన్యుయేల్, రీతూలు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. సీక్రెట్ టాస్క్‌లతో, మైండ్ గేమ్‌లతో హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపిన ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసింది.