Bigg Boss 9| బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో భాగంగా 43వ రోజు నామినేషన్స్ రౌండ్ రచ్చరచ్చగా సాగింది. ఘర్షణలు, ఆరోపణలు, కౌంటర్లతో హౌస్ మొత్తం హీటెక్కింది. బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, అయేషాలకి స్పెషల్ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో వందల బెలూన్లు ఉంచి, వాటిని పగలగొడితే వచ్చే చీటీల ద్వారా నామినేషన్ ప్రాసెస్ కొనసాగించమన్నారు. ప్రతి చీటీ నామినేషన్ హక్కును సూచించింది. అయేషా వద్దకు డైరెక్ట్ నామినేషన్ చీటీ రావడంతో, ఆమె రీతూని నామినేట్ చేసింది. “రీతూ బిగ్ బాస్‌కి లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే వచ్చింది. గేమ్ అసలు ఆడట్లేదు. కెమెరా దృష్టి ఆకర్షించడానికి డ్రామాలు చేస్తుంది” అంటూ అయేషా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దీనిపై రీతూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తిరిగి అయేషాని నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. తదుపరి రీతూ, దివ్య, అయేషా, సాయి మధ్య ఘర్షణలు చెలరేగాయి. దివ్య.. అయేషా, సాయి లను నామినేట్ చేయగా, సాయి కూడా “ఈ హౌస్‌లో ఫ్యామిలీ మెయింటైన్ చేసినది నువ్వే అంటావా? భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు హౌస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇక రీతూ రాముని నామినేట్ చేస్తూ “రాము హౌస్‌లో కనిపించడం లేదు, అతడు ఫేక్” అని కామెంట్ చేసింది. రమ్య మోక్ష తనూజపై దాడి చేస్తూ “తనూజ నటిస్తోంది, ఆమె ఫేక్. ఆమె చేస్తున్నది మొత్తం నటనే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కళ్యాణ్ సంజనని నామినేట్ చేయడంతో ఇమ్మాన్యుయేల్ అసహనం వ్యక్తం చేశాడు. “తనూజని నామినేట్ చేయమని చీటీ ఇచ్చాను, కానీ సంజనని ఎంచుకోవడం బాధ కలిగించింది” అంటూ హర్ట్ అయ్యాడు. గౌరవ్‌కు ఈ వారం స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్, నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమన్నారు. గౌరవ్ అయేషాని రక్షించారు.మొత్తం ఈ వారం నామినేషన్స్ లిస్ట్‌లో రీతూ, సాయి, రాము, కళ్యాణ్, సంజన, దివ్య నిలిచారు. హౌస్‌లో ప్రతి ఒక్కరు ఒకరిపై ఒకరు బాణాలు సంధిస్తుండటంతో, ఈ వారం ఎలిమినేషన్ ఎవరిపైన పడుతుందో చూడాలి.