Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆరో వారం నామినేషన్లు హై వోల్టేజ్ డ్రామాగా మారాయి. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్లో నామినేషన్ల కంటే కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కొత్త కంటెస్టెంట్లు పాత కంటెస్టెంట్ల రిలేషన్లను టార్గెట్ చేస్తూ హౌస్ లో వాతావరణాన్ని వేడెక్కించారు. ఫైర్ బ్రాండ్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన దివ్వెల మాధురీ, రెండో రోజే భరణి–దివ్యల మధ్య ఉన్న బంధాన్ని నిలదీసింది. “దివ్య తప్ప మరో ప్రపంచం కనిపించడం లేదా?” అంటూ ఆమె స్ట్రైట్‌గా ప్రశ్నించింది. మరోవైపు రమ్య మోక్ష కూడా డీమాన్ పవన్‌ని టార్గెట్ చేస్తూ, “నీ గేమ్ నువ్వే ఆడు, రీతూ నీతో మైండ్ గేమ్ ఆడుతోంది” అని సూచించింది.
మాధురీ చేతికి నామినేషన్ బాల్ దొరకగా, ఆమె రీతూకి ఇచ్చింది. రీతూ భరణిని నామినేట్ చేస్తూ, “నువ్వు సపోర్ట్ చేస్తానని చెప్పి, కెప్టెన్సీ టాస్క్‌లో వెనక్కి తగ్గావు” అంటూ ఆరోపించింది. అలాగే దివ్యను కూడా కుకింగ్‌లో డిలే చేశావని కారణం చెబుతూ నామినేట్ చేసింది. మాధురీ భరణి నామినేషన్‌ను తిరస్కరించి, దివ్య నామినేషన్‌ను ఫైనల్ చేసింది. ఇక సంజనా రాము, భరణీలను నామినేట్ చేయడంతో హౌస్‌లో టెన్షన్ నెలకొంది. “బెట్ టాస్క్‌లో ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు లాగుతుంటే నువ్వు సంచాలక్‌గా ఏం చేశావు?” అంటూ భరణిని సంజనా ప్రశ్నించింది. దీనికి భరణి “ఇది గేమ్, ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు సమానమే” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.
తరువాత గౌరవ్ బాల్ని ఆయేషాకు ఇచ్చాడు. ఆమె సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ తనూజ, సంజనాలని నామినేట్ చేశాడు. “మాటలు మారుస్తావు, ఇక్కడో మాట, అక్కడో మాట చెబుతావు” అంటూ తనూజపై ఆరోపణలు చేశారు. దీనికి తనూజ కౌంటర్ ఇస్తూ “సుమన్ అసలు రూపం బయటపడింది” అంది. ఆయేషా కూడా తనూజను టార్గెట్ చేస్తూ, “ఇక్కడ బాండింగ్‌లు పెట్టుకోవడం కాదు, నీ గేమ్ ఆడు. ప్రతి దానికి ఏడవకు, గేమ్‌లో గట్స్ చూపించు” అంటూ గట్టిగా చెప్పింది. “మీరు నిజమైన నాన్న కూతుళ్లు కాదు కదా?” అంటూ హౌస్‌లో హీటు పెంచింది. చివరగా కెప్టెన్ కళ్యాణ్ ఒక్కరిని నామినేట్ చేసే అవకాశం పొందగా, ఆయన రాము రాథోడ్‌ను నామినేట్ చేశాడు. దీంతో ఆరో వారం నామినేషన్ లో సుమన్ శెట్టి, భరణి, తనూజ, దివ్య, రాము రాథోడ్, డీమాన్ పవన్ ఉన్నారు.