Bigg Boss 9 | బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్‌గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజులలో సీజన్ 9 మొదలు కానుండగా, ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇటీవల పలు వీడియోలు విడుదల చేసి షోపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 2025లో ఈ సీజన్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం షోకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. షోకి హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే కొనసాగనున్నారని అధికారికంగా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సీజన్లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సీక్రెట్ రూమ్, రీ-ఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్‌లను తప్పించాలన్న ఆలోచనలో ఉన్నారు. వీటి బదులుగా కొత్త మైండ్ గేమ్స్, ఇంటెన్స్ డ్రామా అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్‌కి సంబంధించి కూడా కొన్ని నూతన నియమాలు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత సీజన్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వలన , కొందరు కంటెస్టెంట్లకు ఒత్తిడికి గురైనట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో మానసిక స్థైర్యం, వ్యక్తిత్వ ప్రదర్శన, సామాజిక పరిపక్వత వంటి అంశాలపై ఎక్కువగా ఆధారపడే టాస్కులు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా విడుదలైంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులని సైతం ఈ సారి బిగ్ బాస్ షోలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.బిగ్ బాస్ తెలుగు 9 మునుపటి సీజన్లను మించేలా మేకర్స్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో రీతూ చౌదరి పేరు హైలెట్ అవుతోంది. ఆమెకు ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.నవ్య స్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్ లతో పాటు కల్పికా గణేష్, తేజస్విని గౌడ, అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, సాయికిరణ్, దీపికా, ఈకనాథ్, దెబ్జానీ, మరి కొందరు ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది.