Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య డ్రామా, మోసాలు, సంబంధాలు, గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, తాజాగా హౌస్‌లోని కాంట్రవర్సీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది రీతూ చౌదరీ. టాస్కుల్లో హడావుడి, కుర్రాళ్లతో పులిహోర, ఇక కెప్టెన్సీ టాస్క్‌లో మోసం… ఇలా అన్ని రకాల హైలైట్స్ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి.రెండో వారం కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ చేసిన తప్పుడు ప్రవర్తనపై శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. రీతూ, డీమాన్ పవన్‌కి కెప్టెన్సీ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో పలువురిని ప్రభావితం చేసినట్లు వీడియోలతో స్పష్టంగా చూపించారు. ఇది గేమ్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు నాగార్జున అభిప్రాయపడ్డారు.
ఫెయిర్‌గా ఆడిన భరణి, ఇమ్మాన్యుయేల్‌లను రీతూ, ప్రియాలు విస్మరించిన తీరుని తప్పుపట్టారు. నాగ్ చూపిన రుజువులపై ఇద్దరూ నోరెళ్లబెట్టినా… కౌంటర్లతో నిలదీశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు కెప్టెన్సీని రద్దు చేస్తూ, కొత్త కెప్టెన్‌ను ఆదివారం ఎపిసోడ్లో ప్రకటిస్తామని తెలిపారు. రీతూ, డీమాన్ పవన్ మధ్య ఆరంభమైన హవా ఇప్పుడు కళ్యాణ్ దాకా విస్తరించిందని హౌస్‌లో ఉన్నవారు కామెంట్లు చేస్తున్నారు. పులిహోర కలిపే ప్రయత్నాలు, ఇద్దరితో క్లోజ్‌గా ఉండే తీరు రీతూ “డబుల్ గేమ్” ఆడుతోందనే ఆరోపణలకు దారితీస్తోంది.
ఇక హౌస్‌లో మరో కీలక మలుపు హరీష్ విషయంలో వచ్చింది. తన భార్య హరిత చెప్పిన “మూడు ప్రశ్నలు” – ‘ఇక్కడ ఎందుకు ఉన్నావ్?’, ‘ఇప్పుడు ఎలా ఉన్నావ్?’, ‘ఇంకా ఏం చేయాలి?’ అనే అంశాలపై శ్రద్ధ పెట్టాలని నాగార్జున హరీష్‌కి సూచించారు. పలు వ్యాఖ్యలపై క్లారిటీ కోరుతూ, గేమ్ మీద ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ వారం హౌస్‌లో తప్పులు చేసిన రీతూ చౌదరీ, మనీష్, ప్రియా, శ్రీజలకు రెడ్ మార్క్ ఇచ్చారు నాగార్జున. వీరి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక చివర్లో, హౌస్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చడంతో గేమ్‌లో కొత్త మలుపు ఏర్పడింది. మొత్తంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో రీతూ చౌదరీ చేసిన మోసం, కెప్టెన్సీ రద్దు, హౌస్‌లో కొత్త ఎమోషనల్ మరియు డ్రామాటిక్ ట్రాక్స్‌తో సీజన్ మరింత క్షణక్షణానికి ఆసక్తికరంగా మారుతోంది. ఆదివారం ఎపిసోడ్లో కొత్త కెప్టెన్ ఎవరవుతాడన్నది చూడాల్సిందే.