Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రొటీన్ గానే కొనసాగుతోంది. కొత్తదనం ఉంటుందేమో అనుకుంటే, మళ్లీ అదే పాత ఫార్ములాలు రంగులు మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. షో సెట్టింగ్స్, టాస్క్‌ల రూపం మారినా అసలు గుణం మాత్రం దాదాపు యథాతథంగా ఉంది. ఈసారి కూడా ఎప్పటిలానే ప్రేమ జంటలు హౌస్‌ను రంజింపజేస్తున్నాయి. ఈ సీజన్ లో రీతు–పవన్, తనూజ–ఇమ్మాన్యుయేల్ లవ్ ట్రాక్‌లు బాగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా తాజా ఎపిసోడ్లో పవన్, రీతు జంట టాస్క్‌లో విజయం సాధించిన సందర్భాల్లో ఒకరినొకరు హగ్గులు చేసుకుంటూ తమ బాండింగ్‌ని మరింతగా ప్రదర్శించారు. వీరి బాండింగ్‌పై ఇతర కంటెస్టెంట్ల నుంచి సెటైర్లు కూడా వస్తున్నాయి. సంజన అయితే “ఛాన్స్ దొరికిందిగా ఇక!” అంటూ ఎద్దేవా చేసింది.
మరోవైపు తనూజ మాత్రం ఈసారి పవన్‌పై అలిగింది. టాస్క్‌లో ఓడిపోతున్న ఫస్ట్రేషన్‌ను ఆమె పవన్ పై చూపించింది. అయినా పవన్ కూల్‌గా స్పందిస్తూ తనూజను ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీనివల్ల ఈ ట్రయాంగిల్ లవ్ (తనూజ–ఇమ్మాన్యుయేల్–పవన్) హౌస్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక హౌస్‌లో గొడవలు కూడా తారాస్థాయికి చేరుతున్నాయి. శ్రీజ వరుసగా రాము రాథోడ్, దివ్యలతో గొడవపడుతూ నెగటివిటీ పెంచుకుంటుంది. మిగతా కంటెస్టెంట్లతో విభేదాలు పెరగడంతో ఆమె నడవడిక కూడా హౌస్‌లో కాంట్రవర్సీగా మారింది. ఐదవ వారం ముగియనున్న సమయంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రానున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే దివ్యా నికితా హౌస్‌లోకి అడుగుపెట్టగా, ఈ వీకెండ్లో మరిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు పోటీ మరింత కఠినంగా మారనుంది. ఇప్పటికే నాలుగు ఎలిమినేషన్లు పూర్తవ్వగా, ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. టాస్క్‌లు, ప్రేమ జంటలు, గొడవలు, సర్ప్రైజ్ ఎంట్రీలు ఇలా బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతూనే ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తోంది. మరి ఈ సారి ఎవరు బిగ్ బాస్ టైటిల్ దక్కించుకుంటారు? ఎవరు ఈ ప్రేమ ఆటల మధ్యలో గేమ్‌లో నిలబడతారు? అనేది ఆసక్తికరంగా మారింది.