Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 షోలో మొదటి ఫైనలిస్ట్‌ను ఎంపిక చేసే టాస్కులు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఈ వారం హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ ఫస్ట్ ఫైనలిస్ట్ ఛాన్స్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. 88వ రోజుకూడా టాస్కులు హోరా హోరీగా సాగాయి. ఎవరు ఈ వారం ఫైనల్‌కు డైరెక్ట్ ఎంట్రీ సాధిస్తారో అనే ఆసక్తి పెరిగింది. రోజు ఆరంభంలోనే కళ్యాణ్, రీతూ, భరణి మధ్య కలర్స్ టాస్క్ జరిగింది. వారి వారికి ఇచ్చిన రంగులను బోర్డుపై సరిగ్గా అమర్చాలి. ఎవరి కలర్ ప్రామినెంట్గా కనిపిస్తే వారు విజేతగా నిలుస్తారు. ఈ రౌండ్లో కళ్యాణ్ సత్తా చాటుతూ విజయం సాధించాడు. తదుపరి యుద్ధ టాస్క్‌కు సుమన్ శెట్టినే పోటీదారుడిగా ఎంపిక చేశాడు.
యుద్ధ టాస్క్‌లో హ్యామర్‌తో వస్తువులను పగలగొట్టి వాటిని త్రాసులో వేయాలి. ఎవరు ఎక్కువ బరువు ఉన్న వస్తువులు వేస్తారో వారు గెలుస్తారు. ఈ పోరాటంలో కూడా కళ్యాణ్ ముందంజలోనే నిలిచాడు. చివరి దశలో సుమన్ ప్రయత్నించినప్పటికీ కళ్యాణ్ అడ్డుకోవడంతో సుమన్ డిస్ బ్యాలెన్స్ అయ్యాడు. దీంతో ఈ టాస్క్‌లో కూడా కళ్యాణ్ విజయం సాధించాడు. గడులు కోల్పోయిన సుమన్ శెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తప్పుకున్నాడు.తదుపరి టాస్కుల కోసం ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఇద్దరూ సీక్రెట్‌గా స్ట్రాటజీ రూపొందించారు. వీరి టార్గెట్ భరణి, రీతూనే. రీతూ భరణిని ఛాలెంజ్ చేసేలా టాస్క్ పరిస్థితులను మార్చాలని నిర్ణయించారు. అందుకోసం కాయిన్స్ బ్యాలెన్స్ టాస్క్‌లో కావాలనే ఓడిపోవాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. అయితే తమ ప్లాన్ రీతూ గుర్తించకుండా జాగ్రత్తగా మూవ్ అయ్యారు.
కళ్యాణ్, ఇమ్ము నిర్ణయించినట్లుగానే బ్యాలెన్స్ టాస్క్‌లో ఇద్దరూ ఓడిపోయారు. దీంతో రీతూ విజేతగా నిలిచింది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో రీతూ భరణినే పోటీదారుడిగా ఎంచుకుంది. ట్రైయాంగిల్, సర్కిల్ వంటి ఆకారాలను వరుసగా అమర్చే ఈ టాస్క్‌లో మొదట భరణి ఆధిక్యంలో ఉన్నా, చివర్లో రీతూ కంబ్యాక్ చేస్తూ విజయాన్ని సాధించింది. ఇమ్ము–కళ్యాణ్ ప్లాన్ విజయవంతమై, చివరికి భరణి ఈ రౌండ్లో అవుట్ అయ్యాడు.