Bigg Boss 9 | ఊహించని ట్విస్టులు, ఆసక్తికర సంఘటనలతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తిరేపుతుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం నాలుగో వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. హౌస్‌లోకి మొత్తం 15 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు శ్రేష్ఠి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. తమకు ఇమ్యూనిటీ రావడంతో తనూజ గౌడ, సుమన్ శెట్టి, అలానే కెప్టెన్ హోదాలో ఉన్న డీమాన్ పవన్‌లు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. మిగిలిన 10 మందిలో ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, మాస్క్ మ్యాన్ హరీష్, దివ్య నికితా, శ్రీజ నామినేషన్స్‌లో నిలిచారు.
సోషల్ మీడియా మరియు బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్ ప్రకారం సంజనా గల్రానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్లోరా షైనీ రెండో స్థానంలో కొనసాగుతుండగా, దివ్య నికితా మూడో స్థానం, రీతూ చౌదరి ఈ వారం నాలుగో స్థానానికి పరిమితమైంది మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ ఐదు, ఆరవ స్థానాల్లో ఉన్నారు. అంటే ప్రస్తుతం శ్రీజ డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ ప్రకారం హరీష్, శ్రీజలే ఎలిమినేషన్ బెంచ్‌మార్క్‌కి చేరువగా ఉన్నారు. మొదటి నుంచీ కఠినంగా, కొంతవరకు నెగటివ్‌గా బిహేవ్ చేస్తున్న హరీష్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ప్రియలాగే, శ్రీజ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది.
ఆమె హౌస్‌లో నిర్లక్ష్యంగా ఉండటం, యాక్టివ్‌గా కనిపించకపోవడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ఫాలోవర్స్ హౌజ్‌లోని కొంతమంది కంటెస్టెంట్లపై తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రీజను అయితే హౌస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ వ్యవహారాన్ని బట్టి చూస్తే ఈ వారం శ్రీజ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.మొత్తంగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాలుగో వారం ఎలిమినేషన్ రౌండ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎవరిని ఉంచాలి? ఎవరిని పంపాలి? అన్న నిర్ణయం ఇప్పుడు పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.
Unstoppable blaze, unshakable race for power! 👁️💥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/AU0SquUY01
— Starmaa (@StarMaa) October 2, 2025