Bigg Boss 9 | బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్ వస్తుందంటే హౌస్మేట్స్ మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా అదే స్థాయి ఆసక్తితో ఎదురు చూస్తారు. ఎందుకంటే వారాలు, నెలలు పాటు బయట ఉన్న కుటుంబ సభ్యులను చూసే అవకాశం అందరికీ ఒక ఎమోషనల్ మోమెంట్. అందుకే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్స్ ఎప్పుడూ హై రేటింగ్స్ తెచ్చిపెడతాయి. అయితే ఈసారి బిగ్‌బాస్ 9 రేటింగ్ పడిపోవడంతో, ఎమోషనల్ మొమెంట్స్ పెంచడానికి టీమ్ ముందే ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఆ స్కెచ్ ప్రాక్టికల్‌గా శనివారం ఎపిసోడ్లో బయటపడింది. శనివారం నాగార్జున హౌస్ మీద రెండు ‘బిగ్ బాంబ్స్’ పడబోతున్నాయని చెప్పి హౌస్‌మేట్స్‌కి టెన్షన్ పుట్టించారు. ఒకటి ఇప్పటికే రివీల్ కాగా, అది డబుల్ ఎలిమినేషన్. ఇంకో బాంబ్ ఎవరి మీద పడుతుందో తెలుసుకోడానికి ఓ చిన్న టాస్క్ పెట్టారు.
ప్రతి కంటెస్టెంట్‌ను తమను ఎక్కువగా సపోర్ట్ చేసిన హౌస్‌మేట్ ఎవరు? తమ ఆటను కిందికి లాగుతున్న హౌస్‌మేట్ ఎవరు? అని చెప్పమన్నారు. అందరిలోనూ ఎక్కువ మంది సంజన పేరు “కిందికి లాగుతుంది” లిస్టులో పెట్టారు. దాంతో ఆ బిగ్ బాంబ్ కూడా సంజన మీదే పడుతుందని నాగ్ చెప్పారు. తీరా బాక్స్ ఓపెన్ చేస్తే అందులో… “NO FAMILY WEEK” అన్న పెద్ద షాక్ కనిపించింది. దాంతో సంజన కన్నీరుమున్నీరయ్యింది సంజనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, అందులో ఒకరు నెలల పసికందు. పిల్లల్ని మిస్ అవుతూ, రోజూ ఏడుస్తూ ఫ్యామిలీ వీక్ కోసం ఓపికగా వెయిట్ చేస్తోంది సంజన. అలాంటి సంజనకి ఫ్యామిలీ రానని తెలిసిన క్షణం సంజనా బాగా విలపించింది. సార్… నేను ఇంటికెళ్తాను… నా వల్ల కాదు… నేను చచ్చిపోతా… రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను… నా పిల్లల్ని చూడాలి సార్…”
అని సంజన ఏడుస్తూ నాగ్‌కీ రిక్వెస్ట్ చేసింది.
నాగ్ మాత్రం ..ఇది ఫలితమే అమ్మా… హౌస్ మెజారిటీ నీ వల్ల ఆట కిందకి లాగబడుతోందని అనుకున్నారు అని సమాధానమిచ్చారు. అంతలో కళ్యాణ్ లేచి “సార్ ఒక ఛాన్స్ ఉంటే నా ఫ్యామిలీ వీక్‌ను నేను త్యాగం చేస్తా… బాంబ్ నాకివ్వండి…” అని చెప్పాడు. భరణి కూడా అదే అభిప్రాయం తెలిపాడు. కానీ నాగ్ ఈ అవకాశం కంటెస్టెంట్ల చేతుల్లో లేదని, బిగ్‌బాస్ నిర్ణయం మాత్రమే ఫైనల్ అని క్లారిటీ ఇచ్చేశారు. ఆడియన్స్ మాత్రం ఈ డ్రామా అంతా చూసిన తర్వాత “రేటింగ్ స్కెచ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీన్‌ను చూసే సమయంలో చాలామందికి సీజన్ 7లో టేస్టీ తేజ ఘటన గుర్తొచ్చింది. అప్పట్లో కూడా తేజకి “NO FAMILY WEEK” పెట్టి అతడిని బాగా ఎమోషనల్ చేసి చివరకు అతడి అమ్మను హౌస్‌లోకి పంపారు. ఇప్పుడు అదే ఫార్ములా సంజన మీద వాడుతున్నారనే అభిప్రాయం బయట ఏర్పడుతోంది.