Bigg Boss 9| బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఐదో వారం పూర్తిగా టాస్క్‌లతో హోరాహోరీగా సాగుతోంది. ఈ వారం ఎపిసోడ్లు ప్రేక్షకులను ఉత్కంఠకి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గురువారం (డే 32) ఎపిసోడ్ ఫన్నీ మూమెంట్స్‌తో పాటు, భావోద్వేగ సన్నివేశాలతో నిండిపోయింది. ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్ మాత్రమే సేఫ్ జోన్లో ఉండగా, మిగిలిన వారంతా నామినేషన్లో ఉన్నారు. వారిలో ఎవరు సేఫ్ అవుతారో నిర్ణయించడానికి బిగ్ బాస్ వరుసగా టాస్క్‌లు ఇచ్చాడు. ఎపిసోడ్ ప్రారంభంలో రీతూ చౌదరీ , సంజనా గల్రానీ ఇద్దరూ కవలల్లా ప్రవర్తిస్తూ ఎంటర్టైన్ చేశారు.
అయితే డేంజర్ జోన్లో ఉన్న వీరిద్దరిని కెప్టెన్ రాము తన స్ట్రాటజీతో బయటకు పంపించాడు. అనంతరం బిగ్ బాస్ “బ్రిడ్జ్ టాస్క్” ఇచ్చాడు. ఎవరు ముందుగా బ్రిడ్జ్ నుంచి బయటకు వస్తారో వారు విన్నర్స్ అని చెప్పాడు. ఈ టాస్క్‌లో కళ్యాణ్–తనూజ జంట మొదట విజయం సాధించగా, భరణి–దివ్య జంట తర్వాత వచ్చింది. చివరగా వచ్చిన సంజనా–ఫ్లోరా ఓడిపోయారు. డాష్‌బోర్డ్‌లో అత్యధిక పాయింట్లు సాధించి భరణి–దివ్య సేఫ్ అయ్యారు. చివరి స్థానాల్లో ఉన్న సంజనా–ఫ్లోరా , సుమన్ శెట్టి–శ్రీజ జంటల్లో ఒకరిని ఎలిమినేట్ చేసే అధికారం బిగ్ బాస్ భరణి–దివ్యకు ఇచ్చాడు. వీరిద్దరూ సంజనా, ఫ్లోరాలను గేమ్ నుంచి తప్పించారు.
తర్వాత బిగ్ బాస్ “గ్లాస్ పిరమిడ్” టాస్క్ ఇచ్చాడు. ఏకాగ్రతతో గ్లాసులను పేర్చే ఈ గేమ్‌లో కళ్యాణ్–తనూజ జంట మొదట విజయం సాధించారు. వారిని అనుసరించి భరణి–దివ్య ప్రదర్శన చూపారు. మొత్తంగా పాయింట్ల ఆధారంగా భరణి–దివ్య జంట మళ్లీ సేఫ్ జోన్లోకి చేరింది. తనూజ త్యాగం చేయడంతో కళ్యాణ్ కూడా సేఫ్ అయ్యాడు. వరుసగా టాస్క్‌లు ఓడిపోవడంతో సంజనా భావోద్వేగానికి లోనైంది. “ఫిజికల్ టాస్క్‌లు మన వల్ల కావు, మైండ్ టాస్క్‌లు అయితే ఆడతాం. ఇలా అబ్బాయిలతో ఫిజికల్ గేమ్స్ ఆడతాం అనుకోలేదు. తెలిస్తే ఈ షోకే రాను” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కానీ తర్వాత “ఉండను, వెళ్తా” అని చెప్పినా, “పోరాడుతా” అని మళ్లీ స్పూర్తి చూపడం గమనార్హం.
ఒకప్పుడు తనూజను కూతురిలా చూసిన భరణి, ఇప్పుడు దివ్యతో క్లోజ్‌గా ఉండటంపై తనూజ ఆగ్రహం వ్యక్తం చేసింది. “దివ్య వచ్చాక భరణి మారిపోయాడు, నా గురించి పట్టించుకోవడం లేదు” అంటూ ఆమె వాపోయింది. ఈ ఇష్యూ హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎపిసోడ్ చివర్లో డాన్స్ టైమ్‌లో సుమన్ శెట్టి తన యూనిక్ స్టైల్లో స్టెప్పులు వేయగా, హౌస్‌లో అందరికి నవ్వులు పూయించారు. ఆయనకు హౌస్మేట్స్ చప్పట్లు కొట్టారు. మొత్తం మీద బిగ్ బాస్ తెలుగు 9 గురువారం ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, డ్రామా అన్నీ మిళితమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.