Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 52వ ఎపిసోడ్ (బుధవారం) పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది. ఒకవైపు ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజల రీఎంట్రీ కోసం టాస్క్ జరుగుతుండగా, మరోవైపు రీతూ–పవన్‌ల మధ్య గొడవలు, కిచెన్ వద్ద సంజనా–తనూజల వాగ్వాదం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటన్నింటిని మించి హౌస్‌లో నవ్వులు పూయించిన సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్ కామెడీ సెగ్మెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఎపిసోడ్ మొదట్లో బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజలలో ఒకరికి హౌస్‌లో ఉండే అవకాశం కల్పించారు. అందుకోసం టవర్ నిర్మాణం టాస్క్ ఇచ్చారు. భరణికి ఇమ్మాన్యుయెల్, రాము, నిఖిల్ సపోర్ట్ చేస్తే, శ్రీజకి పవన్, గౌరవ్ మద్దతుగా నిలబడ్డారు. అయితే టాస్క్‌లో ఎవ్వరూ సరైన రీతిలో పూర్తి చేయలేకపోయారు. చివరికి ఎక్కువ బ్రిక్స్ ఉన్న కారణంగా శ్రీజ విన్నర్‌గా నిలిచింది.
టాస్క్ జడ్జ్‌లుగా ఉన్న కళ్యాణ్, సుమన్ శెట్టి మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. కళ్యాణ్ శ్రీజకు, సుమన్ భరణికి సపోర్ట్ ఇవ్వడంతో వాదోపవాదాలు జరిగాయి. చివరికి దివ్వెల మాధురిని కొత్త సంచాలకురాలిగా బిగ్ బాస్ నియమించగా, ఆమె శ్రీజను విజేతగా ప్రకటించింది. మరోవైపు కిచెన్‌లో పప్పు విషయంలో తనూజ, సంజనాల మధ్య పెద్ద తగువు చోటుచేసుకుంది. “తినే విషయంలో గొడవలు చేస్తారా” అంటూ సంజనా కోపంతో భోజనం మానేసి వెళ్లిపోయింది. అదే సమయంలో టీ విషయంలో దివ్య, గౌరవ్‌ల మధ్య ఘర్షణ నెలకొంది. ఇక రీతూ–పవన్‌ల మధ్య కూడా ఉద్రిక్తత పెరిగింది. “నువ్వు నాకు సపోర్ట్ చేయడం లేదు” అంటూ రీతూ ఆవేశం వ్యక్తం చేయగా, పవన్ “దొబ్బెయ్” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మాట ఇద్దరి రిలేషన్లో బ్రేక్‌కు దారితీసింది. అయితే చివర్లో రీతూ మళ్లీ పవన్‌కి భోజనం తినిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
హౌస్‌లో జరిగిన గొడవల మధ్య సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్ చేసిన కామెడీ అందరిని తెగ నవ్వించింది. వీరిద్దరూ సంజనా, తనూజ, గౌరవ్‌లను ఇమిటేట్ చేస్తూ ఫన్నీగా ప్రదర్శించారు. గౌరవ్ గురించి “చాలా తెలివైన వాడు” అని సుమన్ అనగా, దానికి ఇమ్మూ “వాకీటాకీకి, ఫోన్‌కి తేడా తెలియదు” అని చెప్పడం నవ్వులు పూయించింది. సంజనా “చాలా కూల్‌గా ఉంటుంది” అని సుమన్ చెప్పగా, దానికి ఇమ్మూ “ఎప్పుడూ గొడవలు పడుతూ, నోరేసుకొని మీద పడుతుంది” అని చమత్కరించాడు. తనూజ గురించి “మంచి రేషన్ మేనేజర్” అని సుమన్ చెప్పగానే ఇమ్మూ కిందపడేలా నవ్వడం ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తం మీద… ఈ ఎపిసోడ్లో గొడవలు, డ్రామాలు, కామెడీ అన్నీ కలసి పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా మారాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి–ఇమ్మాన్యుయెల్ జోడి ఈ సీజన్‌కి కొత్త ఫన్ ఫాక్టర్‌గా నిలుస్తోంది.