Bigg Boss 8 Nominations | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు పదోవారంకి చేరుకుంది. హౌజ్ నుంచి నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. దీంతో సోమవారం ఎపిసోడ్‌కు సంబంధించి మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఇక ఈ వారం నామినేషన్స్‌కు సంబంధించి కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారంకు నామినేషన్స్‌కు సంబంధించి ఇద్దరికి బదులు ఒక్కరినే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో హౌస్మేట్స్ అందరు ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ లేపారు. దీనికి సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వహాకులు తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రోమోలో పృథ్వీ.. రోహిణిని నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. రోహిణి తనను ‘నెక్ ఫ్యాంటసీ’ అనడం తనకు అస్సలు నచ్చేలేదని పృథ్వీ చెప్పడం.. ప్రోమోలో చూడవచ్చు. వీరి తర్వాత హరితేజ.. ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ ఎప్పుడు ఫేక్ ఫేక్ అంటూ ఉండడంపై ఫైర్ అయ్యింది హరితేజ. వీరి తర్వాత నిఖిల్ గౌతమ్‌ని నామినేట్ చేశాడు. అయితే ఈ ప్రోమో చూస్తుంటే ఈ వారం కూడా మరింత ఫన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.