Bigg Boss 19 | ఇప్పటికే 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హిందీ వెర్షన్, ఇప్పుడు 19వ సీజన్‌కు రెడీ అయింది. ఈ రియాలిటీ షో ఆగస్టు 24న ప్రారంభమవుతోంది. రాత్రి 9 గంటలకి జియో హాట్ స్టార్‌లో ఈ షో సందడి చేయనుంది.అయితే ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొంతమంది ప్రముఖుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి WWE ఫేమ్ అండర్టేకర్ తో పాటు మైక్ టైసన్ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
అండర్టేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 30 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో తనదైన ముద్ర వేసిన అతను, 2020లో రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి అతడిని తీసుకురావాలని నిర్వాహకులు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను కూడా బిగ్ బాస్ హౌస్‌కి ఆహ్వానించాలనే యత్నాలు జరుగుతున్నాయి. ఆయన తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ ఇద్దరి రెమ్యునరేషన్‌పై చర్చలు కొనసాగుతున్నాయని టాక్. బిగ్ బాస్ ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ కొత్త కాన్సెప్ట్‌లు, అంచనాలకు మించిన ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తోంది. బిగ్ బాస్ 19 కార్యక్రమాన్నికలర్స్ టీవీ మరియు జియో సినిమా / హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. ఇక హౌజ్‌లో అడుగుపెట్టే మిగతా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. బాల నటిగా ఉన్న ఆన్నూరు కౌర్, నటుడు గౌరవ్ ఖన్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ అవేజి దర్బార్, నగ్మా మీరాజ్కర్, షఫాక్ నాజ్, అభిషేక్ బజాజ్, బహిర్ అలీ, హునార్ హలే మరి కొంతమంది గేమ్ డెవలపర్స్ కూడా షోలో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. వీటితోపాటు తెలుగు బిగ్ బాస్ 5 రన్నర్ శ్రీరామచంద్ర, ప్రియా రెడ్డి, మరాఠీ నుంచి ఆర్భాజ్ పటేల్ తో పాటుగా అతుల్ కిషన్, మరి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.