Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ఐదో వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చేందుకు ఐదుగురు వైల్డ్‌కార్డు కంటెస్టెంట్లను రంగంలోకి దించిన నిర్వాహకులు.. మరోవైపు ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ఐదో వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చేందుకు ఐదుగురు వైల్డ్‌కార్డు కంటెస్టెంట్లను రంగంలోకి దించిన నిర్వాహకులు.. మరోవైపు ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో అపూర్వ, చరణ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యంగా చరణ్ ఎలిమినేషన్ సమయంలో షాలినికి వచ్చిన మద్దతు, కొత్తగా హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లంతా ఆమెనే టార్గెట్ చేస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
బిగ్‌బాస్ తెలుగు 10లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు నిర్వాహకులు ఐదుగురు వైల్డ్‌కార్డు కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. బుల్లితెర నటుడు శివకుమార్, నటి దక్షి గుత్తికొండ, డ్యాన్సర్ నీతూ నటరాజ్, డ్యాన్సర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ రామకృష్ణ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరి ఎంట్రీతో హౌస్‌లో కొత్త పోటీ మొదలైనట్లయింది.ఇక ఇప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఆటతీరును గమనించిన కొత్త సభ్యులు.. ఎవరితో స్నేహంగా ఉండాలి, ఎవరిని ఎదుర్కోవాలి అనే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో హౌస్‌లో కొత్త గొడవలు, వ్యూహాలు, గ్రూపుల మధ్య పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
వైల్డ్‌కార్డు కంటెస్టెంట్లకు నాగార్జున ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తారని అడిగారు. ఈ ప్రశ్నకు ఐదుగురి నుంచి దాదాపు ఒకే సమాధానం రావడం విశేషం. అందరూ షాలినిని లక్ష్యంగా చేసుకుంటామని చెప్పుకొచ్చారు. దీనికి వారు చెప్పిన కారణం కూడా చర్చనీయాంశంగా మారింది. షాలిని ఆటపై దృష్టి పెట్టడం కంటే రోహిత్‌తో ఉన్న సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని వారు అభిప్రాయపడ్డారు. గేమ్ విషయంలో ఆమె తన వాదనను గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, పోటీల్లో విజయాలు సాధించడం లేదనే విమర్శలు కూడా చేశారు. ఒకేసారి ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు షాలినినే టార్గెట్ చేస్తామని చెప్పడంతో ఆమెకు హౌస్‌లో సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ విమర్శలకు షాలిని ఎలా స్పందిస్తారు? తన ఆటతీరుతో కొత్త సభ్యుల అభిప్రాయాలను మార్చగలరా? అన్నది రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారనుంది.
ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అపూర్వ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైల్డ్‌కార్డు కంటెస్టెంట్‌గా మూడో వారంలో హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె ప్రయాణం ఐదో వారంతో ముగిసింది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆమె పలువురు కంటెస్టెంట్లతో విభేదాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా త్రిగుణ్, ముఖేష్ తదితరులతో జరిగిన వాగ్వాదాలు చర్చకు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో అపూర్వ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. షాలిని, రోహిత్ మధ్య తాను దూరాలని ఎప్పుడూ అనుకోలేదని ఆమె స్పష్టం చేసింది.ఇక ఈ వారం రెండో ఎలిమినేషన్‌గా చరణ్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. గతంలో ఎలిమినేట్ అయి తిరిగి హౌస్‌లోకి వచ్చిన చరణ్‌కు మరో అవకాశం లభించినప్పటికీ, ఈసారి కూడా తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

